వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓట్లు కొల్లగొట్టిన మోడీ: యూపీ ఎమ్మెల్యేల్లో నేరచరితులు ఎక్కువే

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మూడేళ్ల తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీ హవా కనిపించింది. 2014లో ప్రతిపక్షాలను తుడిచిపెట్టిన బీజేపీ 70కి పైగా లోకసభ స్థానాల్లో గెలిచింది. నాడి మోడీ హవా నేడు కూడా కనిపించింది.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మూడేళ్ల తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీ హవా కనిపించింది. 2014లో ప్రతిపక్షాలను తుడిచిపెట్టిన బీజేపీ 70కి పైగా లోకసభ స్థానాల్లో గెలిచింది. నాడి మోడీ హవా నేడు కూడా కనిపించింది.

యూపీలో బీజేపీ ఓట్ షేర్ కూడా బాగా పెరిగింది. 2012తో పోల్చుకుంటే 25 శాతం ఓట్ షేర్ పెరిగింది. అయిదేళ్ల క్రితం 39.7 శాతంగా ఉంది. ఇప్పుడు బాగా పెరిగింది. 2014 ఎన్నికల సమయంలో 42.7 శాతంగా ఓట్ షేర్ ఉంది.

మోడీ హవా

మోడీ హవా

లోకసభ ఎన్నికల్లో 80 సీట్లకు గాను 73 స్థానాలు గెలిచి.. 90 శాతం సీట్లను గెలిచింది. ఇప్పుడు 403 స్థానాలకు గాను 325 స్థానాలు గెలిచి.. డెబ్బై శాతానికి పైగా సీట్లు సాధించింది.

ప్రతి నలుగురిలో ఒకరు నేర చరితులు

ప్రతి నలుగురిలో ఒకరు నేర చరితులు

యూపీ నూతన ఎమ్మెల్యేల్లోని ప్రతి నలుగురిలో ఒకరు నేర చరిత ఉన్నవారే. మొత్తం 403 మందిలో 103 మందిపై కేసులు ఉన్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారం, అపహరణ, మత విద్వేషాలు, మహిళలపై దౌర్జన్యాలు తదితర తీవ్రమైనవి ఉన్నాయి.

704 మందిపై నేరారోపణలు

704 మందిపై నేరారోపణలు

పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో 704 మందిపై నేరారోపణలు ఉండడం గమనార్హం. అత్యధికంగా బీజేపీ తరఫున 82 మంది, ఎస్పీ తరఫున 11 మంది, బీఎస్పీ, అప్నాదళ్‌ తరఫున ముగ్గురేసి ఎన్నికయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు

బీఎస్పీ అభ్యర్థిపై 16 కేసులు

బీఎస్పీ అభ్యర్థిపై 16 కేసులు

మవ్‌ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఎన్నికైన 57 ఏళ్ల ముక్తార్‌ అన్సారీపై 16 కేసులు ఉన్నాయి. ఇందులో ఎనిమిది హత్య, హత్యాయత్నాల కేసులు. 1996 నుంచి వరుసగా అయిదోసారి ఎన్నికయ్యారు. 4సార్లు జైలులో నుంచే ఎన్నికయ్యారు.

రాజా భయ్యాపై 8 కేసులు

రాజా భయ్యాపై 8 కేసులు

కుందా నియోజకవర్గం నుంచి వరుసగా ఆరోసారి ఎన్నికయిన రఘునాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ అలియాస్‌ రాజా భయ్యాపై ఎనిమిది క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. హత్యాయత్నం, కిడ్నాప్‌, దోపిడీవంటివి ఉన్నాయి.

జైళ్ల శాఖ నిర్వహించిన రాజా భయ్యా

జైళ్ల శాఖ నిర్వహించిన రాజా భయ్యా

భద్రీ రాజవంశానికి చెందిన ఆయన 1993లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అఖిలేష్‌ మంత్రివర్గంలో పౌరసరఫరాలతో పాటు, జైళ్ల శాఖను నిర్వహించారు. తీవ్రంగా పోటీ నెలకొన్నప్పటికీ ఈసారి ఆయనకు 65 శాతం ఓట్లు వచ్చాయి.

సాధానా సింగ్, రీటాల పైనా..

సాధానా సింగ్, రీటాల పైనా..

ఖైరానా నుంచి ఎస్పీ అభ్యర్థిగా విజయం సాధించిన నహిద్‌ హసన్‌పై శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి తీవ్రమైన మూడు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ముఘల్ సరాయి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సాధనా సింగ్‌పై ఏడు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. బీజేపీలో చేరి లక్నో కంటోన్మెంట్‌ నుంచి విజయం సాధించిన రీటా బహుగుణ జోషీపై రెండు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

English summary
In an outcome unmatched over the last 40 years, the Bharatiya Janata Party (BJP) won 312 out of 403 (77.4 percent) seats in India’s largest state assembly in its most-populous state, increasing its vote share by 25 percentage points from the 2012 assembly elections to 39.7 percent in 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X