సినిమా ప్రేరణతో 12 పెళ్ళిళ్ళు: సహకరించిన భర్త, పెళ్ళి రోజే ట్విస్టిచ్చే వధువు

లక్నో: ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్ళి పీటల వరకు తీసుకెళ్ళి పెళ్ళి చేసుకొన్న మొదటి రోజే డబ్బు, నగలతో పరారైన కిలాడి పెళ్ళి కూతురు ఉదంతమిది. అయితే ఇప్పటికే ఈ పెళ్ళి కూతురు 12 మందిని వివాహం చేసుకొంది. కిలాడి లేడీ మొదటి భర్తే ఈ పెళ్ళి ఏర్పాట్లను దగ్గరుండి చూస్తారు. పెళ్ళ కాగానే భార్యను తప్పిస్తాడని పోలీసులు గుర్తించారు.

డబ్బుల కోసం ఎంత దారుణానికైనా తెగబడే ఘటనలను చూస్తున్నాం. అయితే వివాహల పేరుతో కూడ డబ్బులను దోచుకోవచ్చనే ఉదంతం యూపీలో చోటు చేసుకొంది.

డబ్బుల కోసమేత పెళ్ళిని కూడ వాడుకొంటున్నారు. అంతేకాదు భర్తే ఈ నీచానికి పాల్పడుతున్నాడని పోలీసులు విచారణలో కనుగొన్నారు.. ఎట్టకేలకు కిలాడీ పెళ్ళి కూతురును పోలీసులు అరెస్ట్ చేశారు.

 12 పెళ్ళిళ్లు చేసుకొన్న కిలాడీ లేడీలు

12 పెళ్ళిళ్లు చేసుకొన్న కిలాడీ లేడీలు

ప్రేమ పేరుతో యువకులను ముగ్గులోకి దించడం, వారిని పెళ్ళి పీటలవరకు తీసుకెళ్ళడం ప్రీతి అనే వివాహిత చేస్తోంది. ఉత్తర్‌‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రీతి ప్రేమ పేరుతో యువకులను వివాహం చేసుకొని పెళ్ళైన రోజునో, మరునాడో డబ్బులు, నగలతో ఉడాయించేది.ఈ రకంగా సుమారు 12 మందిని వివాహం చేసుకొన్న ప్రీతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ నగరానికి చెందిన ప్రీతీ అనే వివాహిత తన భర్తతో కలిసి సీరియల్ పెళ్లిళ్లకు తెర లేపింది. ప్రీతి అందంగా ముస్తాబై వచ్చి యువకులను ఆకర్షించి ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకోమని అడుగుతోంది. దీంతో యువకులు కూడ పెళ్ళికి ఓకే చెబుతారు.

Recommended Video

    Uttar Pradesh CM Yogi Adityanath Resigns
    సినిమా ప్రేరణతో

    సినిమా ప్రేరణతో

    సోనమ్ కపూర్ నటించిన డాలీ కి డాలీ చిత్రం చూసింది. ఈ చిత్రం నుండి ప్రేరణ పొంది పెళ్లిళ్ల పేరిట మోసాలకు తెర లేపానని ప్రీతి పోలీసులకు తేల్చి చెప్పింది. సినిమాలను చూసి ప్రీతి ప్రేరణ పొందినట్టు చెప్పడం సంచలనం కల్గిస్తోంది.వీరి వెనుక మరికొందరు ముఠా సభ్యుల హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు.

     ప్రీతి భర్తే కీలకపాత్ర

    ప్రీతి భర్తే కీలకపాత్ర

    ప్రీతి యువకులను ఆకట్టుకొని వారిని పెళ్లి పీటలెక్కించి మోసగించి పారిపోతున్న వ్యవహారంలో భర్త పాత్ర కూడా ఉందని పోలీసులు వివరించారు. పెళ్లి ఏర్పాట్లు భర్తే చూసే వాడని పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు.ఈ రకంగా 12 మంది యువకులను ప్రీతి మోసం చేసింది.

    పరువు కోసం ఫిర్యాదుకు దూరంగా

    పరువు కోసం ఫిర్యాదుకు దూరంగా

    మూడు ముళ్లు పడగానే వధువు ప్రీతి నగలు, డబ్బుతో పారిపోతోంది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు 12 మంది వరులను మోసగించిందని యూపీ జిల్లా ఎస్పీ ఉదయ్ శంకర్ చెప్పారు. లేడీ కిలాడీ మోసాలపై సమాజంలో తమ పరువు పోతుందనే భయంతో వరులైన యువకులు సైతం ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని ఎస్పీ చెప్పారు. దీంతో ఈ లేడీ కిలాడీ మోసాల పెళ్లిళ్ల తంతు సాగించిందని పోలీసులు చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+