UPSC Mains 2020 : సివిల్స్-2020 మెయిన్స్ ఫలితాలు విడుదల...

యూపీఎస్సీ మెయిన్స్-2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inలో ఉంచారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఎంపిక అవుతారు. ఇంటర్వ్యూలో అర్హత సాధించేవారిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్‌తోపాటు ఇతర సెంట్రల్ సర్వీసెస్ (గ్రూప్ ఏ, బీ) పోస్టులకు ఎంపిక చేస్తారు.

Upsc.gov.in హోమ్ పేజీలో 'UPSC Mains result link 2020' లింకుపై క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థుల రూల్ నంబర్స్‌ పీడీఎఫ్ ఫైల్‌లో పొందుపరచబడి ఉంటాయి. మెయిన్స్‌ క్లియర్ చేసిన అభ్యర్థులు మార్చి 25,2021 నుంచి ఏప్రిల్ 5,2021 వరకూ యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. న్యూఢిల్లీలోని షాజహాన్ రోడ్‌ ధోల్పూర్ హౌస్‌లో ఉన్నయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించిన ఈ-సమన్ లెటర్స్ త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

UPSC Civil Services Main Exam 2020 Result Declared

యూపీఎస్సీ అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ఇందులో స్టేజ్‌-1 ప్రిలిమినరీ పరీక్ష, స్టేజ్‌-2 మెయిన్స్, స్టేజ్‌ -3 ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ లో అర్హత సాధించినవారు మెయిన్స్‌కు ఎంపిక అవుతారు. మెయిన్స్‌ క్లియర్ చేసినవారు ఇంటర్వ్యూకు ఎంపిక అవుతారు. ఇంటర్వ్యూ తర్వాత యూపీఎస్సీ ప్రకటించిన మేరకు గ్రూప్ ఏ, గ్రూప్ బీ సర్వీసెస్‌కు ఎంపిక అవుతారు. యూపీఎస్సీ మెయిన్స్-2020 పరీక్షను ఈ ఏడాది జనవరి 8-జనవరి 17 వరకూ నిర్వహించారు. ఇక ఈ ఏడాది యూపీఎస్సీ 2021 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జూన్ 27న జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+