అక్రమ సంబంధాన్ని ప్రశ్నిస్తే భార్యను చంపేశాడు
ముంబై: తన కూతురిని చంపేసిన అల్లుడిని క్షమించేందుకు ముంబైకి చెందిన ఓ మహిళ క్షమించేందుకు ఉషా ధనంజయ్ ససేమిరా అన్నది. తన అల్లుడిని క్షమించబోనని ఆమె తేల్చే చెప్పింది. తన అల్లుడికి విధించిన మరణశిక్షను వీలైనంత త్వరగా అమలు చేయాలని ఆమె కోరుకుంది.
తన ఆరేళ్ల మనవరాలి భవిష్యత్తు గురించి ఆమె బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. మనవరాలిని తనకే అప్పగించాలని ఆమె కోర్టును కోరారు. 2016 జనవరి 15వ తేదీన కోర్టు విచారణ చేపట్టనుంది. తన కాలేజీలో చదువుతున్న నిమ్మీ ధనంజయ్‌ని అతిఫ్ పొపెరే ప్రేమించాడు. 2008లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

వివాహమైన తర్వాత నిమ్మీ తన పేరును బుష్రాగా మార్చుకుంది. తర్వాత వారిద్దరు దుబాయ్ వెళ్లిపోయారు. 2009లో వారికి పాప పుట్టింది. 2013 మార్చిలో 24 బుష్రాను అతిఫ్ చంపేశాడు. తనకు అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు ఆమెను అతను హత్య చేశాడు.
అతీఫ్‌కు, అతడికి సహకరించిన మరో వ్యక్తికి దుబాయ్ కోర్టు మరణశిక్ష వేసింది. వారిని కాల్చి చంపాలని ఆదేశించింది. మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలనే అతని విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అతడికి నిమ్మి కుటుంబం క్షమాపణ పెడితే తప్ప మరణశిక్ష ఆగదు.
అతడిని క్షమించబోనని నిమ్మీ తల్లి ఉషా ధనంజయ్ స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలోనే మనవరాలిని తనకు అప్పగించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications