దళిత మహిళని బంధించి లైంగికంగా దాడి, మతం మార్చుకోమని ఒత్తిడి

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్ పూర్‌లో తాహిద్ అనే వ్యక్తి తన భార్య, బావ మరిది సాయంతో 30 ఏళ్ల దళిత మహిళను ఐదు నెలలుగా బంధించి, అత్యాచారం చేశాడు. అంతే కాదు బలవంతలు మత మార్పిడికి ఒత్తిడి తెచ్చాడని బుధవారం పోలీసులు వెల్లడించారు.

బాధితురాలి మంగళవారం చేసిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాహిద్ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకొని వెళ్లాడు. తాహిద్ తన భార్య తబాసుమ్, బావమరిది పప్పు సాయంతో ఆమెను బంధించాడు.

Uttar Pradesh: Dalit woman held captive, raped, forced to convert

ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు, మతం మార్చుకోమని ఒత్తిడి చేసినట్లు తెలిసిందన్నారు. ఎలాగోఒకలా మంగళవారం బాధితురాలు తప్పించుకుని సమీపంలో ఉన్న ఆశ్రమానికి చేరుకుని వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలకు సమీప ఆసుపత్రికి తరలించారు. నిందితుల ముగ్గురిని త్వరగా పట్టుకోవాలని, విచారణ వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ సోనియా సింగ్ ఆదేశించారు. ప్రస్తుతానికి కేసు దర్యాప్తులో ఉందని ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+