అద్వానీకి షాక్: పార్లమెంటరీ బోర్డ్ ఛైర్మన్‌గా అమిత్‌షా
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డ్ ఛైర్మన్‌గా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికయ్యారు. పార్లమెంటరీ బోర్డు నుంచి పార్టీ అగ్రనేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను తొలగించారు. వారి స్థానంలో జెపి నడ్డా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు చోటు లభించింది. 12 మంది సభ్యలతో పార్టీ పార్లమెంటరీ బోర్డును నియమించారు.
12మంది సభ్యులలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, అనంతకుమార్, థవర్‌చంద్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, జగత్ ప్రకాశ్ నడ్డా, రాంలాల్ ఉన్నారు.

బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ
బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా అమిత్ షా ఎన్నికయ్యారు. సభ్యులుగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, అనంతకుమార్, థవర్‌చంద్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, జగత్ ప్రకాశ్ నడ్డా, జూల్ ఓరామ్, షానవాజ్ హుస్సేన్, విజయ రహత్కర్ ఎన్నికయ్యారు.
పార్టీకి మార్గ దర్శనం చేసేందుకు అమిత్ షా మార్గదర్శక్ మండల్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ మార్గదర్శక్ మండల్‌లో అటల్ బీహార్ వాజ్‌పాయి, ఎల్‌కె అద్వానీ, నరేంద్ర మోడీ, మురళీ మనోహర్ జోషి, రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు.












Click it and Unblock the Notifications