ఇది అదనం: వెంకయ్య, సీఎం అభ్యర్థిత్వంపై పాట వినిపించిన స్మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన పైన నమ్మకం ఉంచి, పార్టీ తనకు అదనపు బాధ్యతలను అప్పగించిందని, దానిని వమ్ము చేయనని చెప్పారు.

మనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు సక్రమంగా నిర్వర్తించానని చెప్పారు. ఇప్పుడు సమాచార, ప్రసార శాఖను కూడా అలాగే నిర్వర్తిస్తానని వ్యాఖ్యానించారు. మోడీ నాయకత్వంలో తమ ప్రభుత్వం పేదలకు ఉపయోగపడే ఎన్నో పథకాలు ప్రారంభించిందన్నారు.

ప్రొఫైల్ మార్చిన స్మృతి ఇరానీ

కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో మానవవనరుల శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీను జౌళీ శాఖకు మారారు. దీంతో ఆమె తన ట్విట్టర్‌ ఖాతాలో ప్రొఫైల్‌ను మార్చుకున్నారు. అయితే జౌళి శాఖ మంత్రిగా రాయకుండా కేంద్ర మంత్రి, గుజరాత్‌ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా మాత్రమే తన ప్రొఫైల్‌లో పేర్కొన్నారు.

Venkaiah Naidu addresses media after taking charge

ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో వివాదాల్లో చిక్కుకున్న స్మృతి ఇరానీని మానవ వనరుల శాఖ నుంచి తప్పించారు. ఆ స్థానంలో ప్రకాశ్‌ జవదేకర్‌ను నియమించిన విషయం తెలిసిందే.

కాగా, మానవవనరుల శాఖ మంత్రిగా నూతనంగా బాధ్యతలు చేపడుతున్న జవదేకర్‌.. స్మృతిని కలిశారు. ఈ సందర్భంగా జవదేకర్‌కు ఆమె అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆమె ట్విట్టర్‌ వేదికగా.. ప్రధాని మోడీ సహా పలువురికి కృతజ్ఞతలు తెలిపారు. జౌళి శాఖ బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దేశంలో ప్రముఖ రంగాల్లో ఒకటైన జౌళి శాఖలో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై..

మేక్ ఇన్ ఇండియాలో జౌళీ శాఖ కీలకమైనదని, అందుకే ప్రధాని మోడీ తనకు ఈ బాధ్యతలు అప్పగించారని స్మృతి బుధవారం చెప్పారు. యూపీలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేగా అని విలేకరులు ప్రశ్నించగా.. కొందరు అలా అంటారని, అది వాళ్ల పనేనని చెబుతూ హిందీ పాటలోని కొన్ని వ్యాఖ్యలు వినిపించారు.

'కుచ్ తో లోగ్ కహేంగే.. లోగోంకా కామ్ హై కహానా' అని చెప్పారు. ఓ జౌళీ సాఖ మంత్రి బాధ్యతల స్వీకరణకు ఇంత పెద్ద ఎత్తున మీడియా రావడం ఎప్పుడైనా చూశారా అని ఆమె ప్రశ్నించారు. ఈ బంధం వీడనిది అని వ్యాఖ్యానించడంతో మీడియా ప్రతినిధులు చిరునవ్వులు చిందించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New I&B Minister Venkaiah Naidu addresses media after taking charge

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X