సిపిఐ కురువృద్ధుడు బర్దన్ కన్నుమూత
న్యూఢిల్లీ : సిపిఐ అగ్రనేత ఏబీ బర్ధన్(92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతన్న బర్దన్ చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శనివారం సాయంత్రం వరకు ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఢిల్లీలోని రామ్ మనోమర్ లోహియా ఆస్పత్రిలో బర్దన్ కన్నుమూశారు.
గతత నెల పక్షవాతంతో ఆస్పత్రిలో చేరిన బర్ధన్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. నిరుడు డిసెంబర్ 7వ తేదీ నుంచి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. బర్దన్ 1924 సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్ లోని బరిసాల్ లో జన్మించారు. 1957లో కార్మిక ఉద్యమంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బర్ధ్దన్, వామపక్ష పార్టీలో అనేక కీలక పదవులు నిర్వహించారు.

1957లోనే మహారాష్ట్ర అసెంబ్లీకి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. సిపిఐ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. మహారాష్ట్ర వామపక్ష రాజకీయాల్లో, కార్మిక ఉద్యమాల్లో అర్దేందు భూషన్ బర్దన్ అనే ఎబి బర్దన్ ప్రముఖ పాత్ర పోషించారు.
1957లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1990లో ఆయన ఢిల్లీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తొలుత సిపిఐ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి అయ్యారు.
బర్దన్ మృతికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.












Click it and Unblock the Notifications