చెంప చెళ్లుమనిపించాడు: ఆగ్రహంతో ఊగిపోయిన విజయ్‌కాంత్..
వివాదస్పద రీతిలో వార్తల్లోకి ఎక్కడం డీఎండీకె అధినేత విజయ్ కాంత్ కు ఈమధ్య కామన్ అయిపోయింది. గతేడాది ఎన్నికల ప్రచారం సందర్బంగా.. కొంతమంది పాత్రికేయుల మీద ఆగ్రహంతో ఊగిపోయిన విజయ్ కాంత్ .
చెన్నై: వివాదస్పద రీతిలో వార్తల్లోకి ఎక్కడం డీఎండీకె అధినేత విజయ్ కాంత్ కు ఈమధ్య కామన్ అయిపోయింది. గతేడాది ఎన్నికల ప్రచారం సందర్బంగా.. కొంతమంది పాత్రికేయుల మీద ఆగ్రహంతో ఊగిపోయిన విజయ్ కాంత్ వారిని చెంపదెబ్బ కొడుతానంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇదే తరహా సీన్ మళ్లీ రిపీట్ అయింది. అయితే ఈసారి డీఎండీకె కార్యకర్త పైనే ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాదు, అందరిముందు సదరు కార్యకర్త చెంప చెళ్లుమనిపించడంతో అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇంతకీ ఆ కార్యకర్త చేసిన తప్పిదమేంటంటే.. జిందాబాద్ బదులు వర్ధిల్లాలి అని పలకడమే.

తమిళనాడులోని పెరంబళూరులో శుక్రవారం నాడు డీఎండీకే ఆధ్వర్యంలో నిర్వహించిన 'మీతో నేను' అనే కార్యక్రమంలో విజయ్ కాంత్ ఇలా ప్రవర్తించారు. అప్పటిదాకా కార్యకర్తల సమస్యలకు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విజయ్ కాంత్.. కార్యక్రమం ముగిసిన వెంటనే వేదిక దిగి బయటకు నడవడం మొదలుపెట్టారు.
ఇంతలో విజయ్‌కాంత్ కు ఎదురుపడ్డ ఓ కార్యకర్త 'విజయకాంత్ వర్దిల్లాలి' అంటూ గట్టిగా నినదించాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన విజయ్ కాంత్ కార్యకర్త చెంప చెళ్లుమనిపించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications