వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత ఎస్టేట్ లో హత్య: రెండు జీపుల్లో దర్జాగా ఎస్కేప్, సీసీ కెమెరాల్లో!

జయలలిత కొడనాడు ఎస్టేట్ లోకి రెండు జీపుల్లో వెళ్లిన దుండగులు అక్కడ సెక్యూరిటీ గార్డును హత్య చేసి చోరీ చేసి వెళ్లారని సమీపంలోని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డును హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొడనాడుతో పాటు కోయంబత్తూరు నగరం పరిసర ప్రాంతాల్లో పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు.

సోమవారం వేకువ జామున జయలలిత కొడనాడు ఎస్టేట్ లో చోరబడిన దుండగులు అక్కడ పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ ను అతి దారుణంగా హత్య చేశారు. తరువాత బంగ్లాలో చోరీ చేసి అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

గ్రామస్తులు

గ్రామస్తులు

కొడనాడు ఎస్టేట్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గ్రామస్తులను పోలీసు అధికారులు విచారిస్తున్నారు. పలువురు గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించిన పోలీసు అధికారులు ఆ సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.

హత్య చేసిన తరువాత

హత్య చేసిన తరువాత

జయలలిత కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ ను హత్య చేసిన నిందితులు అక్కడ ఎలాంటి సాక్షాలు చిక్కకుండా జాగ్రత్త పడ్డారని పోలీసులు అంటున్నారు. అయితే సంఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

రెండు జీపుల్లో వచ్చారని

రెండు జీపుల్లో వచ్చారని

జయలలిత కొడనాడు ఎస్టేట్ లోపలినుంచి రెండు బోలెరో జీపుల్లో దుండగులు బయటకు వచ్చారని సమీపంలోని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు దుండగుల కోసం గాలిస్తున్నారు.

సీసీ కెమెరాల్లో

సీసీ కెమెరాల్లో

జయలలిత కొడనాడు ఎస్టేట్ లోని సీసీ కెమెరాలు, పరిసర ప్రాంతాల్లో స్థానికులు ఏర్పాటు చేసుకున్న సీసీకెమెరాల్లోని క్లిప్పింగ్స్ ను పోలీసులు పరిశీలించారు. సీసీకెమెరాల్లోని క్లిప్పింగ్స్ ఆధారంగా దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కోయంబత్తూరులో దుండగులు ?

కోయంబత్తూరులో దుండగులు ?

జయలలిత కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డును హత్య చేసి చోరీ చేసిన దుండగులు కోయంబత్తూరులో తలదాచుకునే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు నగరం మొత్తం జల్లెడపడుతున్నారు. అనుమానం వచ్చిన వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
Jayalalithaa Kodanadu estate: Villagers have reportedly told the police that a gang was seen entering the estate in two jeeps.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X