మణిపూర్‌లో మళ్లీ హింస! ఏకంగా ఎస్పీ కార్యాలయంపైనే దాడి, గాయాలు
మణిపూర్ రాష్ట్రంలో మరోసారి అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కాంగ్‌పోక్‌పీలో ఎస్పీ, డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై కుకీ మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు వాహనాలు ధ్వంసం కాగా.. ఎస్పీ సహా పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున వచ్చిన కుకీ మిలిటెంట్లు దాడికి దిగడంతో ఆ ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో అక్రమ బంకర్లను కూల్చివేసేందుకు భద్రతా దళాలు ఇటీవల భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలకు వ్యతిరకంగా స్థానిక గ్రామాల్లో కుకీలు ఆందోళనలు చేపట్టారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. దీంతో కేంద్ర బలగాలను వెనక్కి పంపించాలంటూ మరోసారి ఆందోళనలకు దిగారు.

కేంద్ర బలగాలను వెనక్కి పంపించడంలో పోలీసు ఉన్నతాధికారులు విఫలమయ్యారంటూ శుక్రారం సాయంత్రం కుకీలు, కుకీ మిలిటెంట్లతోపాటు పెద్ద ఎత్తున వచ్చి భారీ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే భద్రతా దళాలు వారిని అడ్డుకోవడంతో కాంగ్‌పోక్‌పీ జిల్లా ఎస్పీ కార్యాలయం, డీసీ కార్యాయం వైపు దూసుకెళ్త రాళ్లు, ఇతర ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
Kangpokpi SP Manoj Prabhakar reportedly injured. These are apparently Manipur Police vehicles.
— Meitei Heritage Society (@meiteiheritage) January 3, 2025
Waiting for the Indian state to respond? Or is it going to be business as usual? pic.twitter.com/cLztCKcVcD
కాగా, కుకీ మిలిటెంట్లు కొందరు ఆయుధాలతో కనిపించడం గమనార్హం. కుకీల దాడిలో ఎస్పీ ప్రభాకర్ సహా అనేక మంది పోలీసులు సిబ్బంది గాయపడ్డారు. పోలీసుల ప్రతిఘటనలో ఆందోళనకారుల్లో కూడా కొందరికి గాయాలైనట్లు తెలిసింది. హింసాత్మక ఘటనలు పెరుగుతుండటంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో భారీగా మోహరిస్తున్నారు.
3/1/2025
— BeeThangjam (@beethangjam) January 3, 2025
📍 Update From Kangpokpi!!‼️#Kangpokpi is in shambles as #Kuki destroys government property and vehicles, demanding that the SP vacate the BSF from Uyokching.
Who gave them the authority to dictate terms?#KukiEngineeredManipurViolence#KukiWarCrimes… pic.twitter.com/7tXC3CrXSB
కాగా, మే 3, 2023 నుంచి మణిపూర్ మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ, కుకీల మధ్య తరచుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. రిజర్వేషన్లు, ఆర్థిక ప్రయోజనాల అంశం వీరి మధ్య వివాదాలకు ఆజ్యం పోసింది. ఇప్పటికే వరకు జరిగిన హింస ఫలితంగా 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications