శశికళ సామ్రాజ్యం పథనం: ఇక మిగిలింది మన్నార్ గుడి మాఫియానే !
చెన్నై: మన్నార్ గుడి మాఫియా లీడర్ అనే పేరు తెచ్చుకున్న శశికళ నటరాజన్ కు నాలుగేళ్లు జైలు శిక్షపడటంతో మన్నార్ గుడి మాఫియా గ్యాంగ్ దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఎలాగైనా ఇంతకాలం చక్రం తప్పిన మన్నార్ గుడి గ్యాంగ్ సభ్యులు ఇప్పుడు చిన్నమ్మ జైలుపాలు కావడంతో ఆయోమయంలో పడిపోయారు.
ఇప్పటికే బహిరంగంగా శశికళ మీద తిరుగుబాటు చేసిన తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీద మన్నార్ గుడి గ్యాంగ్ రగిలిపోతోంది. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయితే మా పని ఫినిష్ అని తెలుసుకున్న మన్నార్ గుడి గ్యాంగ్ ఆయనకు ఆ చాన్స్ ఇవ్వకుండా చెయ్యాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఇప్పటికే శశికళను పోయెస్ గార్డెన్ నుంచి బయటకు పంపించడానికి సిద్దం అయిన పన్నీర్ సెల్వం అక్కడి జయలలితకు చెందిన వేదనిలయాన్ని అమ్మ స్మారక భవనం చెయ్యాలని ఆదేశాలు జారీ చేస్తూ జీవోలో సంతకం పెట్టేసి శశికళకు చుక్కలు చూపించారు.

ఇప్పుడు ఆయన సీఎం అయితే తమిళనాడు ప్రభుత్వానికి మద్యం సరఫరా చేస్తున్న శశికళకు చెందిన మిడాస్ సంస్థ మీద వేటు వెయ్యాలని పన్నీర్ వర్గీయులు ప్లాన్ వేశారు. అదే జరిగితే రూ. 1,800 కోట్ల టర్నోవర్ ఉన్న మిడాస్ సంస్థ మీద వేటుపడితే మన్నార్ గుడి గ్యాంగ్ కు కోలుకోలేని దెబ్బపడుతుంది.
మన్నార్ గుడి గ్యాంగ్ వ్యాపారాల మీద దెబ్బ కొట్టాలని పన్నీర్ సెల్వం వర్గీయులు అంటున్నారు. అయితే శశికళ తను ప్రతిపాధించిన సీనియర్ నాయకుడు ఎడప్పాడి కే. పళనిసామి సీఎం అయితే ఓరకంగా గడ్డనపడవచ్చని మన్నార్ గుడి మాఫియా సభ్యుల ప్లాన్.
అయితే పన్నీర్ సెల్వం చక్రం తిప్పి ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటే మాత్రం పరిస్థితి తల్లకిందలు అవుతుందని మన్నార్ గుడి మాఫియా గ్యాంగ్ ఆందోళన చెందుతోంది. మొత్తం మీద పన్నీర్ సెల్వం సీఎం కాకుండా అన్ని వైపుల నుంచి అడ్డుకోవాలని మన్నార్ గుడి గ్యాంగ్ ప్లాన్ వేసింది.












Click it and Unblock the Notifications