వార్డెన్ శిక్ష: అన్నదమ్ములకు గుండు గీయించాడు

బెంగుళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణమైన సంఘటన చోసుచేసుకుంది. ఓ ప్రముఖ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు సోదరులకు హాస్టల్ వార్డెన్ గుండు గీయించాడు. పాఠశాలకు వెళ్లనందుకు శిక్షగా అతను ఈ పని చేయించాడు. తరగుతులకు హాజరు కానందుకు అన్నకు గుండు గీయించగా, అన్న అనుమతి తీసుకోకుండా ఇంటికి వెళ్లినందుకు తమ్ముడికి అతను గుండు గీయించి శిక్ష వేశాడు.

ఆ సంఘటన జనవరి 28వ తేదీన జరిగింది. సెయింట్ జోసెఫ్ ఇండియన్ హైస్కూల్ హాస్టల్ వార్డెన్ కిరణ్ పదో తరగతి చదువుతున్న ఫ్రాన్సిస్ సెబాస్టియన్ గత బుధవారం తరగతులకు గైర్హాజరైనందుకు శిక్ష విధించాడు. తీవ్ర అవమానానికి గురైన ఫ్రాన్సిస్ ఇంటికి వెళ్లి తండ్రి సెబాస్టియన్ ఆగస్టిన్‌కు ఫిర్యాదు చేశాడు. తండ్రి బెగూరులో కన్‌స్ట్రక్షన్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.

మర్నాడు అదే పాఠశాలలో చదువుతున్న చిన్న కుమారుడు చార్లెస్ సెబాస్టియన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తన అన్న చెప్పకుండా ఇంటికి వెళ్లాడనే ఆరోపణతో కిరణ్ తన తలను గీకించాడని చెప్పాడు. దాంతో ఆగస్టీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. తాము దర్యాప్తు చేస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు

Warden shaves students' head

కిరణ్‌పై ఏ విధమైన కేసు పెట్టవచ్చుననే విషయంపై పోలీసులు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. పాఠశాల అధికారులను తమ కుమారులకు విధించిన శిక్షపై ఆగస్టిన్ వివరణ కోరాడు. జుట్టులో చుండ్రు పడడంతో తలలు గీకించినట్లు పాఠశాల అధికారులు చెబుతున్నారు. ఫ్రాన్సిస్‌కు తాము ఇంటి వద్దనే క్షౌరం చేయించినట్లు పోలీసులకు చెప్పాడు.

ఒకవేళ చుండ్రు పట్టి ఉంటే తనకు పాఠశాల అధికారులకు సమాచారం అందించాల్సిందని ఫ్రాన్సిస్ వాదిస్తున్నాడు. అలాంటి సమస్య ఉంటే తాము చికిత్స కోసం వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్లేవాళ్లమని అన్నాడు. ఇతర విద్యార్థుల ముందు వార్డెన్ తన కుమారులను అవమానించాడని ఆయన ఆరోపిస్తున్నాడు.

విద్యాబోధన విషయంలో తమకు ఏ విధమైన ఫిర్యాదులు లేవని, నిరుపేద కుటుంబం నుంచి విద్యార్థులను చేర్చుకోవడం పట్ల తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఫ్రాన్సిస్ భయపడి పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం వల్లనే తాము పోలీసులను సంప్రదించామని ఆగస్టీన్ అంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+