నీళ్లనూ దొంగిలించే రోజులొచ్చాయి.. రైతు అరెస్టు..
నీళ్లనూ దొంగిలించే రోజులొచ్చాయి. మనిషికి కావాల్సిన కనీస అవసరాలు కూడా కొందరికే పరిమితమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాక గుక్కెడు నీళ్ల కోసం యుద్దాలే చేయాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయేమో. తాజాగా బుందేల్ ఖడ్ లో హీరాలాల్ అనే వ్యక్తి మీద ఓ నీటి దొంగతనం కేసు నమోదైంది. ఆస్తికి నష్టం కలిగించాడన్న అభియోగం మీద అతన్ని అరెస్టు చేసినట్టుగా మహోబా ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. నీటిని సరఫరా చేసే ఓ వాటర్ పైప్ లైన్ నుంచి కొన్ని లీటర్ల నీటిని దొంగలించి ఒక గొయ్యిలో ఆ నీటిని నిల్వ చేసినట్టుగా ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదైంది. ఇదే విషయాన్ని వెల్లడించారు వాటర్ ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజీవ్ భట్నాగర్.

కాగా.. హీరాలాల్ నీటి దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్తుంటే, అతని కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. తన తండ్రిపై లేని నిందను మోపారని, పైప్ లైన్ పగిలి నీరు వృథాగా పోతున్నా పట్టించుకోని అధికారులు తమ తప్పు బయటపడకుండా ఉండేందుకే తన తండ్రిని ఇరికించారని చెప్తున్నాడు హీరాలాల్ కొడుకు అర్జున్.












Click it and Unblock the Notifications