వాచౌట్: 2014లో ఏ సర్వే సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి..?

Recommended Video

    Lok Sabha Elections 2019 : 2014 లో ఏ సర్వే సంస్థ... ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి..? || Oneindia Telugu

    దేశంలో చివరి దశ విడత పోలింగ్ జరుగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత 6:30 గంటల నుంచి ఇక మీడియాదే హడావుడి అవుతుంది. ఎందుకంటే ఎవరికి వారే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటిస్తారు. అయితే 2014లో నాడు ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్‌లో భాగంగా ఏయే సర్వే సంస్థలు ఎన్ని సీట్లను ఆయా పార్టీలకు కట్టబెట్టాయి..? ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏ సర్వే సంస్థ లేదా మీడియా ఛానెల్ చెప్పిన అంచనాలు నిజమయ్యాయి...?

    2014 ఏ సంస్థ ఎగ్జిట్ ఫలితాలు నిజమయ్యాయి..?

    2014 ఏ సంస్థ ఎగ్జిట్ ఫలితాలు నిజమయ్యాయి..?

    దేశంలో మే 19 సాయంత్రం 6 గంటలకు 2019 సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. ఆ తర్వాత అరగంటకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అసలు ఫలితాలు వచ్చేవరకు ప్రజలను చర్చలో ఉంచుతాయి. ఈ క్రమంలోనే ఒక్కసారి 2014 ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఫ్లాష్ బ్యాక్ చూస్తే ఏసర్వే సంస్థ/ మీడియా ఏ పార్టీకి ఎన్ని సీట్లు కట్టబెట్టిందో చూద్దాం.

    టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనాలే దగ్గరయ్యాయి

    టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనాలే దగ్గరయ్యాయి

    ఇక 2014 సమయంలో దేశవ్యాప్తంగా మోడీ మేనియా ఉన్నింది. ఆ సమయంలో ఎన్డీయేనే భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే భారీ విజయం ఎన్డీయే కూటమినే వరిస్తుందని అన్ని మీడియా / సర్వే సంస్థలు తెలిపాయి. కానీ ఒక్క టుడేస్ చాణక్య మాత్రమే సంఖ్యాపరంగా దాదాపుగా కరెక్టుగా అంచనా వేసింది. నాడు ఎన్డీయేకు 336 సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది చాణక్య సంస్థ. ఇక ఫలితాలు వెలువడగానే చాలా దగ్గరగా అంటే 340 స్థానాలను ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంది. ఇక యూపీఏకి 70 స్థానాలు వస్తాయని అంచనా వేయగా 60 స్థానాలు వచ్చాయి. అందులో కాంగ్రెస్‌కు 44 స్థానాలు మాత్రమే వచ్చాయి.

    ఇతర సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి

    ఇతర సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి

    ఇక టైమ్స్‌నౌ ఓఆర్జీ ఎగ్జిట్ పోల్ ఎన్డీయేకు 249 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అయితే అసలు ఫలితాలు వచ్చేసరికి ఆ సంస్థ అంచనా 23 సీట్లు తేడాతో తప్పింది. అయితే యూపీఏకు 148 స్థానాలు వస్తాయని అంచనా వేయగా ఇక్కడా పూర్తిగా దెబ్బతినింది. ఇక సీఎన్ఎన్ ఐబీఎన్ -సీఎస్‌డీఎస్ పోల్స్ , హెడ్‌లైన్స్ టుడే, సిసెరో పోల్స్ ఎన్డీయేకు 261 నుంచి 283 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. యూపీఏకు 92 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక ఇండియా టీవీ-సీ ఓటర్ మరియు ఏబీపీ నీల్సన్ పోల్స్ రెండూ కూడా ఎన్డీయేకు భారీ విజయం చేకూరుతుందని ఆ కూటమికి 281 నుంచి 289 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో బీజేపీకి తిరుగలేని స్థానాలను అక్కడి ప్రజలు కట్టబెడుతున్నారని జోస్యం చెప్పింది.

    ఇక 2019 సార్వత్రిక ఎన్నికలు మే 19 సాయంత్రం 6 గంటలకు ముగుస్తాయి. ఇక వీటికి సంబంధిచిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సాయంత్రం 6:30 గంటలకు వస్తాయి. అసలు పండగ మే 23న ఉంది. ఆ రోజు వెలువడే ఫలితాలు ఏమేరకు ఎగ్జిట్ పోల్స్‌తో సరిపోలుతాయో వేచిచూడాలి. అప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక చూడాలి మళ్లీ మోడీ సర్కార్‌ వస్తుందా.. లేక ప్రజలు మార్పును కోరుకుంటున్నారా..? ప్రతిక్షణం జరిగే డెవలప్‌మెంట్స్ వన్ ఇండియా తెలుగు మీకు అందిస్తుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+