జయలలితపై ఏనుగు దాడి.. వైరల్ వీడియో..
కోయంబత్తూరులోని ముదుమలై నేషనల్ పార్క్ ను జయలలిత సందర్శించిన సమయంలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
చెన్నై: దివికేగిన తమిళ సీఎం జయలలిత జ్ఞాపకాలను తమిళనాడు ప్రజలు స్మరించుకుంటున్నారు. సీఎంగా ఆమె పంథాను, సంక్షేమ పథకాలను.. 'అమ్మ'గా తమ మనసుల్లో చెరగని ముద్ర వేసిన తీరును రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జయలలిత జీవిత ప్రస్థానంతో పాటు ఆమె జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర ఘటనలు తెరపైకి వస్తున్నాయి.
కోయంబత్తూరులోని ముదుమలై నేషనల్ పార్క్ ను జయలలిత సందర్శించిన సమయంలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. జయలలిత ఏనుగుకు అరటిపండు తినిపిస్తున్న సమయంలో.. అది ఒక్కసారిగా ఆమె మీదకు దూసుకొచ్చి వెనక్కి నెట్టివేసింది. దీంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై.. ఏనుగును అదుపు చేసి ఆమెను పక్కకు తీసుకెళ్లారు. అనుకోని ఘటనకు జయలలిత కంగు తిన్నారు.












Click it and Unblock the Notifications