వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంజీఆర్ చనిపోయాక.. జయను ఎంత ఘోరంగా అవమానించారంటే!

ఎంజీఆర్ పార్థివదేహాన్ని తరలిస్తున్న వాహనంలో జయ ఎక్కడానికి ప్రయత్నించడంతో.. అక్కడే ఉన్న ఎమ్మెల్యే డాక్టర్.కె.పి.రామలింగం జయపై కేకలు వేస్తూ ఆమె మీదకు వచ్చాడు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: సినిమాల్లోంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టాక.. జయలలిత జీవితం చాలానే ఆటుపోటులకు గురైంది. వాటన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఆరుసార్లు తమిళనాడు సీఎంగా తన సత్తా ఏంటో చాటింది జయలలిత. ముఖ్యంగా తన రాజకీయ గురువు ఎంజీఆర్ మరణించినప్పుడు జయలలిత జీవితంలో అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

ఎంజీఆర్ మరణవార్తను తన స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న జయలలిత.. ఆయన పార్థివ దేహాన్ని చూడటం కోసం తొట్టంలోని ఆయన ఇంటికి బయలుదేరారు. అయితే అప్పటికే జయను ఇంట్లోకి రానివ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో ఇంటి వెనక పక్కనున్న గేటు నుంచి లోపలికి వెళ్లారు జయలలిత.

అప్పటికీ ఆమెను లోపలికి రావడానికి అనుమతించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎంజీఆర్ పార్థివ దేహాన్ని రాజాజీ హాల్ కు అంబులెన్స్ లో తరలించడానికి సిద్దమయ్యారు. దీంతో అంబులెన్స్ ను ఫాలో అవాల్సిందిగా జయ తన కారుకు డ్రైవర్ కు చెప్పారు. అక్కడ దాదాపు 13గం.ల పాటు తన అభిమాన నేత పార్థివ దేహం వద్దనే కూర్చున్నారు జయలలిత.

When Jayalalithaa withstood abuse and stood by MGR’s body for 2 whole days

పార్థివ దేహాన్ని ఉంచిన మరుసటిరోజు.. పక్కనున్న మహిళలు తనను గోళ్లతో గిల్లడం, కాళ్లను తొక్కడం, చర్మంపై గుచ్చడం వంటి ఇబ్బందికర పరిణామాల్ని జయ ఎదుర్కొన్నారు. అయినా
ఆమె మాత్రం పార్థివ దేహం పక్కనుంచి కదలలేదు. ఇక అక్కడినుంచి అంత్యక్రియల కోసం ఆయన పార్థివ దేహాన్ని తరలించడానికి సిద్దమైన తరుణంలో జయకు ఘోర అవమానం ఎదురైంది.

ఎంజీఆర్ పార్థివదేహాన్ని తరలిస్తున్న వాహనంలో జయ ఎక్కడానికి ప్రయత్నించడంతో.. అక్కడే ఉన్న ఎమ్మెల్యే డాక్టర్.కె.పి.రామలింగం జయపై కేకలు వేస్తూ ఆమె మీదకు వచ్చాడు. ఇంతలోనే ఎంజీఆర్ భార్య జానకి తమ్ముడు కొడుకు, నటుడు దీపన్ జయను వద్దకు వచ్చి ముఖంపై దాడి చేశాడు. జుట్టు పట్టుకుని ఈడ్చినంత పనిచేసి వాహనం నుంచి కిందకి నెట్టేశాడు. దీంతో జయకు స్వల్ప గాయాలయ్యాయి.

అయితే అక్కడితో జయకు జరిగిన అవమానం ఆగిపోలేదు. ఆ తర్వాత అసభ్య పదజాలంతో ఆమెను దూషించడంతో.. జయ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘోర అవమానకర ఘటనను జీర్ణించుకోలేక ఎంజీఆర్ అంత్యక్రియలకు జయ దూరంగానే ఉండిపోయారు. ఓ సీనియర్ జర్నలిస్ట్ తో ఇంటర్వ్యూ సందర్బంగా.. తనకు జరిగిన ఈ అవమానాల గురించి చెప్పుకుంటూ తీవ్రంగా కలత చెందారు జయలలిత.

English summary
It was a stunning blow to Jayalalithaa. He had departed, leaving her in the lurch. In a daze she summoned the driver and rushed to Ramavaram Gardens, MGR’s residence, but when she reached there she was refused permission to enter the house. She got out of the car and banged on the door with her fists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X