రైతు కుటుంబం నుంచి తమిళ సీఎం వరకు: ఎవరీ పళనిస్వామి?
తమిళనాడులో గత వారం రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామి కొత్త ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
చెన్నై: తమిళనాడులో గత వారం రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామి కొత్త ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. పళనిస్వామి దివంగత సీఎం జయలలితకు కూడా నమ్మకస్తుడే కావడం గమనార్హం. రైతు కుటుంబం నుంచి వచ్చిన పళనిస్వామి.. అనూహ్యంగా రీతిలో ముఖ్యమంత్రిగా తెరపైకి రావడం వెనక అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళే ఉన్నారు.
పళనిస్వామి ప్రస్తానం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. అన్నాడీఎంకే సీనియర్ నేతల్లో ఒకరైన పళనిస్వామి..సేలం జిల్లా సిరువన్‌పాలెం ప్రాంతంలోని రైతు కుటుంబానికి చెందినవారు. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే చీలిక వచ్చినప్పుడు జయలలిత పక్షాన చేరారు.
1989లో జయలలిత వర్గం నుంచి కోడిపుంజు గుర్తుపై ఎడప్పాడి నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1991, 2011, 2016 ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2011లో జయలలిత మంత్రివర్గంలో రహదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో ప్రజాపనుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న పళనిస్వామికి గతంలోనూ సీఎం పీఠం దక్కినట్లే దక్కి దూరమైంది. జయలలిత మరణానంతరమే ముఖ్యమంత్రిగా పళనిస్వామిని నియమించాలని శశికళ గట్టి ప్రయత్నాలే చేయగా శాసనసభ్యుల్లో ఏకాభిప్రాయం కుదరదన్న భావనతో పన్నీరుసెల్వాన్ని నియమించారు.
అనంతరం పార్టీలో తలెత్తిన సంక్షోభాల నడుమ శశికళే ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తెచ్చారు. అక్రమాస్తుల కేసుల్లో జైలుకెళ్లినా తనకు నమ్మకస్తుడైన వ్యక్తినే సీఎం చేసి శశికళ పంతం నెగ్గించుకున్నారని అన్నాడీఎంకే నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా పళనిస్వామి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం అనుకోని రాజకీయ పరిణామమనే చెప్పవచ్చు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications