తమిళనాడు, బెంగాల్, కేరళ, అస్సాంలో గెలిచేదెవరు ? సత్తా బజార్ తాజా అంచనా..!

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల (election) ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే అంశంపై ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే గతంలో ఎగ్జిట్ పోల్స్ పలుమార్లు విఫలమైన నేపథ్యంలో అంతకుమించిన వాస్తవ అంచనాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సట్టా బజార్ తాజా అంచనాలు (Satta Bazaar Predictions) సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

West Bengal Prediction: బెంగాల్ తీర్పు క్లియర్- ప్రముఖ సెఫాలజిస్ట్ గ్రౌండ్ రిపోర్ట్..!
West Bengal Prediction: బెంగాల్ తీర్పు క్లియర్- ప్రముఖ సెఫాలజిస్ట్ గ్రౌండ్ రిపోర్ట్..!

సత్తా బజార్ తాజా అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్లో బీజేపీ 149-152 సీట్లు గెల్చుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. అలాగే అధికార టీఎంసీ 137-140 సీట్లు సాధించి రెండో స్ధానంలో నిలవబోతున్నట్లు తేలింది. అలాగే తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి 134-137 సీట్లు సాధించి అధికారం నిలబెట్టుకుంటుందని సత్తా బజార్ అంచనాల్లో తేలింది. మరోవైపు కేరళలో విపక్ష యూడీఎఫ్ 77-79 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తేలింది.

Who Will Win Election Predictions for Tamil Nadu West Bengal Kerala amp amp Assam
Tamil Nadu Twist: ఎగ్టిట్ పోల్స్ తో తమిళ లెక్క మారిందా ? పార్టీల రియాక్షన్ ఇదే..!
Tamil Nadu Twist: ఎగ్టిట్ పోల్స్ తో తమిళ లెక్క మారిందా ? పార్టీల రియాక్షన్ ఇదే..!

కేరళలో అధికార ఎల్డీఎఫ్ కూటమికి 60-62 సీట్లు మాత్రమే లభిస్తున్నట్లు సత్తా బజార్ అంచనా తెలిపింది. అటు అస్సాంలో అధికార బీజేపీ 99-101 సీట్లు సాధించి భారీ మెజార్టీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తేలింది. విపక్ష కాంగ్రెస్ కు 24-26 సీట్లు మాత్రమే దక్కబోతున్నట్లు సత్తా బజార్ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో సైతం అస్సాంలో బీజేపీ, కేరళలో యూడీఎఫ్, తమిళనాడులో డీఎంకే కూటమి, బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తాయని మెజార్టీ సర్వేలు స్పష్టం చేశాయి. ఇప్పుడు సత్తా బజార్ కూడా దాదాపుగా ఇదే విషయాన్ని చెప్పేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+