వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఎవరీ గాయత్రి ప్రజాపతి, సామాన్యుడి నుండి మంత్రివరకిలా,గవర్నరిలా...

గ్యాంగ్ రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయత్రి ప్రజాపతిని ఇంకా మంత్రివర్గంలో కొనసాగించడంపై ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను వివరణ కోరారు. ఈ మేరకు లేఖ రాశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:గ్యాంగ్ రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయత్రి ప్రజాపతిని ఇంకా మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారని ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ యూపి

ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను ప్రశ్నించారు. ఈ మేరకు గవర్నర్ ముఖ్యమంత్రిని వివరణ కోరారు.

ఉత్తర్ ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్న గాయత్రి ప్రజాపతి, ఆయన అనుచరులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశంతో పోలీసులు గాయత్రి ప్రజాపతిని అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.అయితే గాయత్రి ప్రజాపతి అదృశ్యమయ్యారు.

గాయత్రి ప్రజాపతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పార్టీ మారారని ఇటీవలే ఓ మంత్రిని అఖిలేష్ యాదవ్ తన మంత్రివర్గం నుండి తొలగించారు.

అయితే గ్యాంగ్ రేప్ ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రి గాయత్రి ప్రజాపతిని మాత్రం ఇంత వరకు తొలగించలేదు.

గాయత్రి ప్రజాపతిని ఎందుకు తొలగించలేదు

గాయత్రి ప్రజాపతిని ఎందుకు తొలగించలేదు

తన మంత్రివర్గంలో ఉన్న గాయత్రి ప్రజాపతిపై గ్యాంగ్ రేప్ ఆరోపణలున్న నేపథ్యంలో ఆయనను ఇంకా ఎందుకు మంత్రివర్గం నుండి తప్పించలేదని ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను వివరణ కోరారు.


ఈ మేరకు అఖిలేష్ కు గవర్నర్ లేఖ పంపినట్టు రాజ్ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.గాయత్రి ప్రజాపతిపై అరెస్టు వారెంట్ కూడ జారీ అయింది.

అఖిలేష్ పై విపక్షాల విమర్శలు

అఖిలేష్ పై విపక్షాల విమర్శలు

గ్యాంగ్ రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయత్రి ప్రజాపతికి మద్దతుగా అఖిలేష్ యాదవ్ ప్రచారం నిర్వహించడం పై విపక్షాలు విమర్శలు గుప్పించారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడ ఈ విషయాన్ని తన ప్రచారంలో ప్రస్తావించారు.అయితే గాయత్రి ప్రజాపతితో అఖిలేష్ యాదవ్ వేదికను
పంచుకోలేదు. సుప్రీంకోర్టు కేసు నమోదు చేయించినా అఖిలేష్ ఆయన కోసం ప్రచారానికి వెళ్తున్నారని విపక్షాలు ఎద్దేవా చేశారు.

ఎవరీ గాయత్రి ప్రజాపతి

ఎవరీ గాయత్రి ప్రజాపతి

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడుగా గాయత్రి ప్రజాపతికి పేరుంది.


ములాయం సింగ్ ఆశీస్సులతోనే గాయత్రి ప్రజాపతి మంత్రిగా ఎదిగాడు.సమాజ్ వాదీ పార్టీ సంక్షోభ సమయంలో అఖిలేష్ యాదవ్ తన క్యాబినెట్ నుండి పెద్ద మొత్తంలో మంత్రులను తొలగించినా గాయత్రి ప్రజాపతికి స్థానం దక్కింది.ములాయం సింగ్ ఆశీస్సులతోనే గాయత్రి ప్రజాపతి అంచెలంచెలుగా ఎదిగాడని రాజకీయవర్గాలు చెప్పారు.

బిపిఎల్ కార్డు హొల్డర్ నుండి మంత్రిగా

బిపిఎల్ కార్డు హొల్డర్ నుండి మంత్రిగా

గత ఐదేళ్లలో గాయత్రి ప్రజాపతి రాజకీయాల్లోకి అడుగుపెట్టి దాదాపు తన చుట్టూ సునామీలాంటి వాతావరణం సృష్టించాడు.


2012లో ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన అమితాసింగ్ ను ఓడించాడు. అమితాసింగ్ ను ఓడించడం ద్వారా గాయత్రి ప్రజాపతి ములాయం సింగ్ కు అత్యంత సన్నిహితుడుగా మారాడు.తొలుత అఖిలేష్ వర్గంలో స్వతంత్ర శాఖ నిర్వహిస్తూ అనతికాలంలోనే మైనింగ్ మంత్రిగా మారాడు. ఆ వెంటనే కేబినెట్ ర్యాంకు కూడ దక్కింది. దీంతో మైనింగ్ శాఖకు కూడ మైనింగ్ శాఖకు ఇంచార్జ్ గా కొనసాగాడు.

గాయత్రి ప్రజాపతి నేరాలిలా

గాయత్రి ప్రజాపతి నేరాలిలా

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు నూతన్ ఠాకూర్ గాయత్రి ప్రజాపతి అక్రమాలను బయటపెట్టాడు.


2015 జనవరిలో గాయత్రి ప్రజాపతి అక్రమాలపై లోకాయుక్తను
ఆశ్రయించాడు ఠాకూర్.ఆ తర్వాత అతడికి వ్యతిరేకంగా ఆధారాలను సేకరించాడు. అమితాబ్ ఠాకూర్ అనే ఐపిఎస్ అధికారి కూడ పిర్యాదుల పరంపర సాగించాడు.ములాయం సింగ్ యాదవ్ ఐపిఎస్ అధికారికి వార్నింగ్ ఇచ్చారు.లోకాయుక్త అక్రమాస్తుల కేసులో గాయత్రి ప్రజాపతికి క్లీన్ చిట్ ఇచ్చింది.

అలహబాద్ హైకోర్టు మాత్రం మైనింగ్ అక్రమాలపై విచారణ చేయాలని సిబిఐను ఆదేశించింది.ఈ విచారణ ఇంకా సాగుతోంది.

English summary
Uttar Pradesh Governor Ram Naik has written to Chief Minister Akhilesh Yadav asking reasons for retaining rape accused Gayatri Prajapati in his Cabinet.Non-bailable warrants against Prajapati and six others were issued by police on Saturday, while the minister’s passport was impounded and a look-out notice issued against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X