సరదా, నా కోసం ఆతృత: సవాల్‌కు రమ్య నో, క్షమాపణ
బెంగళూరు: ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో సెలబ్రిటీలు, వీవీఐపీలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే, కన్నడ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు రమ్య మాత్రం ఐస్ బకెట్ ఛాలెంజ్‌ను నో చెబుతున్నారు.
ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గొన్న వారు మరొకరికి సవాల్ విసుతున్న విషయం తెలిసిందే. దీంతో, ఐస్ బకెట్ ఛాలెంజ్‌కి నో చెప్పిన రమ్య, తనను నామినేట్ చేసిన వారిని క్షమాపణ కోరారు.
అయితే, ఐస్ బకెట్ ఛాలంజ్‌లో పాల్గొనక పోవడంపై ఆమె వివరణ ఇచ్చారు. వ్యాధి పైన అవగాహన పెంచేందుకు, నిధులు సమీకరించేందుకు ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు సరదా కార్యక్రమంగా మారిపోయిందని ఆమె అభిప్రాయపడుతున్నారు.

రమ్య
ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటున్న వారు కేవలం సరదా కోసం నీళ్లు పోసుకోవడమే కాకుండా.. ఎంతో కొంత మొత్తాన్ని ఇవ్వాలని సూచించారు.

రమ్య
తాను ఐస్ బకెట్ ఛాలెంజ్ తీసుకోవాలని చాలామంది ఆతృతతో ఎదురు చూస్తున్నారని, కానీ, తాను దీనిని స్వీకరించడం లేదని తెలిపారు.

రమ్య
ఐస్ బకెట్ ఛాలెంజ్ ఎందుకు ప్రారంభమైందో, ఆ వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆమె సూచించారు. తాను మరో ఛాలెంజ్‌ని దేనినైనా తీసుకుంటానని, ఈ సవాల్ మాత్రం స్వీకరించనని చెప్పారు.

రమ్య
కాగా, సోనాక్షి సిన్హా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సోనాక్షి సిన్హా ఓ బకెట్‌లో ఒక్క ఐస్ ముక్క వేసుకొని పై నుండి కింద దాకా వేసుకున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications