Wife: పండుగ పూట ఊరికి వెళ్లిన భర్త, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఫైనాన్షియర్ భార్య, ఏం జరిగింది !

బెంగళూరు: వడ్డీ వ్యాపారం చేస్తున్న యువకుడు అందంగా ఉన్న యువతిని వివాహం చేసుకున్నాడు. ఫైనాన్సియర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ యువకుడు వ్యాపారాలు చేస్తున్నాడు. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. వ్యాపారం పని మీద భర్త బయట ఊర్లకు ఎక్కువగా తిరుగుతున్నాడు. సంక్రాంతి పండుగ ముందు దేశరాజధాని ఢిల్లీకి ఫైనాన్షియర్ వెళ్లాడు. ఢిల్లీకి వెళ్లిన భర్త అతని భార్యకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఉదయం టిఫిన్ చేసిన భార్య ఆమె కొడుకు ఇడ్లీలు తినిపించింది. తరువాత బెడ్ రూమ్ లోకి వెళ్లిన ఫైనాన్షియర్ భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రీతిలో కనపడిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్న ఫైనాన్షియర్ భార్య అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఐటీ హబ్ లో ఫైనాన్షియర్ కాపురం

ఐటీ హబ్ లో ఫైనాన్షియర్ కాపురం

ఐటీ హబ్ బెంగళూరులోని కాటన్ పేట్ లోని భక్షిగార్డెన్ లో యశవంత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం యశవంత్ అందంగా ఉన్న దివ్యా (23) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. యశవంత్, దివ్యా దంపతులకు ఒ కొడుకు ఉన్నాడు. యశవంత్ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఫైనాన్సియర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యశవంత్ వ్యాపారాలు చేస్తున్నాడని సమాచారం.

ఢిల్లీకి వెళ్లిన భర్త

ఢిల్లీకి వెళ్లిన భర్త

సంక్రాంతి పండుగ రెండు రోజుల ముందు ఫైనాన్షియర్ యశవంత్ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లాడు. ఢిల్లీకి వెళ్లిన యశవంత్ అతని భార్య దివ్యాకు రోజూ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడని సమాచారం. ఉదయం ఇంట్లో టిఫిన్ చేసిన యశవంత్ భార్య దివ్యా ఆమె కొడుకు ఇడ్లీలు తినిపించింది. తరువాత బెడ్ రూమ్ లోకి వెళ్లిన దివ్యా లోపల లాక్ చేసుకుందని తెలిసింది.

ఉరి వేసుకున్న ఫైనాన్షియర్ భార్య ?

ఉరి వేసుకున్న ఫైనాన్షియర్ భార్య ?

దివ్యా ఎంతసేపటికి లోపల రూమ్ లో నుంచి బయటకు రాకపోవడంతో యశవంత్ తల్లి వెళ్లి తలుపులు కొట్టింది తెలిసింది. కోడలు దివ్ాయ రూమ్ లో నుంచి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన యశవంత్ తల్లి చుట్టుపక్కల వాళ్లకు విషయం చెప్పింది. తలుపులు పగలగొట్టి చూడగా దివ్యా ఉరి వేసుకుని రీతిలో కనపడిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

డెత్ నోట్ కూడా లేదు

డెత్ నోట్ కూడా లేదు

విషయం తెలుసుకున్న యశవంత్ ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకుని పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. దివ్యా ఆత్మహత్య చేసుకునే ముందు ఎలాంటి డెత్ నోట్ రాసిపెట్టలేదని పోలీసు అధికారులు అంటున్నారు. దివ్యా ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+