Wife Sketch: రోజూ అదే పంచాయితి, కాలితో భర్త గొంతు తొక్కి చంపేసిన భార్య, శీలం !

బెంగళూరు: మద్యం మత్తులో ఊగిపోతున్న భర్త భార్యతో సంసారం చెయ్యలేదు. నేను సక్రమంగా సంసారం చెయ్యలేదు కదా, నా భార్య ఎలా సంతోషంగా ఉంది అంటూ భర్తకు అనుమానం పెరిగింది. భార్య శీలంపై అనుమానంతో భర్త ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని తెలిసింది. మద్యం వ్యసనంలో ఉన్న భర్తను కాపాడుకోవడానికి అతన్ని భార్య మద్యవ్యసనం నుంచి విముక్తి కల్పించడానికి శిక్షణ ఇచ్చే కేంద్రంలో పెట్టింది. అక్కడి నుంచి బయటకు వచ్చిన భర్త మళ్లీ మద్యం మత్తులో ఊగిపోయాడు. భార్య శీలం గురించి పదేపదే గొడవ పడుతున్న భర్త మద్యం మత్తులో నిద్రపోతున్న సమయంలో అతని గొంతు మీదకాలు వేసి తొక్కి చంపేయడం కలకలం రేపింది.

 ఇష్టం ఉంటే పని...... లేదంటే ?

ఇష్టం ఉంటే పని...... లేదంటే ?

బెంగళూరులోని జేజేనగర్ లోని ఓబుళేశు కాలనీలో మోహన్ (41), పద్మావతి అలియాస్ పద్మా (36) దంపతులు నివాసం ఉంటున్నారు. 16 ఏళ్ల క్రితం మోహన్, పద్మావతికి పెళ్లి జరిగింది. మోహన్, పద్మావతి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. బీబీఎంపీలో చెత్త సేకరించే ఆటోకు డ్రైవర్ గా మోహన్ పని చేస్తున్నాడు. ఇష్టం వచ్చినప్పుడు మోహన్ పనికి వెలుతున్నాడు, లేదంటే లేదు.

 భార్య శీలం మీద అనుమానం

భార్య శీలం మీద అనుమానం

భార్య పద్మావతి బీబీఎంపీలో పారిశుద్ద కార్మికురాలిగా పని చేస్తోంది. వేకువ జామున4 గంటలకే పద్మావతి పని చెయ్యడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. వేకువ జామున చీకటిలో ఇంటి నుంచి బయటకు వెతులున్న భార్య పద్మావతి శీలం మీద భర్త మోహన్ కు మొదటి నుంచి అనుమానం ఎక్కువ. దానికి తోడు మోహన్ కు ప్రతిరోజూ తాగే అలవాటు ఉంది.

 తాగుబోతు దెబ్బతో ఢమాల్

తాగుబోతు దెబ్బతో ఢమాల్

రోజూ పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెలుతున్న మోహన్ నువ్వు ఎవరితో తిరుగుతున్నావ్ అంటూ అతని భార్య పద్మావతితో గొడవ పడేవాడని సమాచారం. మొగుడి దెబ్బతో హడలిపోయి రోజు గొడవలు పడుతున్న పద్మావతి భర్త మోహన్ ను మద్యపానం మానివెయ్యడానికి శిక్షణ ఇచ్చే ఓ కేంద్రంలో తీసుకెళ్లి పడేసింది.

 మనోడు మాత్రం మారలేదు

మనోడు మాత్రం మారలేదు

శిక్షణా కేంద్రం నుంచి బయటకు వచ్చిన మోహన్ మళ్లీ మద్యం సేవించడం మొదలుపెట్టాడు. పనిపాట లేకుండా ఇంట్లో ఉంటూ రోజూ భార్య పద్మావతికి టార్చర్ పెట్టాడని తెలిసింది. ఆదివారం రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన మోహన్ భార్యతో గొడవపెట్టుకుని తాగిన మైకంలో నిద్రపోయాడు.

 గొంతు మీద కాలేసి తొక్కి భర్తను చంపేసిన భార్య

గొంతు మీద కాలేసి తొక్కి భర్తను చంపేసిన భార్య

భర్త తీరుతో విసిగిపోయిన పద్మావతి సోమవారం వేకువ జామున 3. 30 గంటల సమయంలో భర్త మోహన్ గొంతు మీద కాలుపెట్టి తొక్కేసింది, మద్యం మత్తులో ఉన్న మోహన్ దెబ్బకు కోమాలోకి వెళ్లిపోయాడు. వెంటనే మోహన్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై మోహన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, అతని భార్య పద్మావతిని అరెస్టు చేశామని జేజే నగర్ పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+