నిర్భయ దోషులకు ఉరి..? త్వరలోనే అమలు, 28వ తేదీనే సమాచారం..
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేస్తామని తీహార్ జైలు అధికారులు ప్రకటించారు. నిర్భయపై లైంగికదాడి చేసిన కీచకులు ముఖేశ్, వినయ్, అక్షయ్, పవన్‌కు త్వరలో ఉరిశిక్ష అమలు చేస్తామని పేర్కొన్నది. వారికి ఉరిశిక్ష అమలు చేసే విషయాన్ని ఈ నెల 28వ తేదీన తెలియజేశామని తెలిపింది.
నిర్భయ కేసు దేశంలో కలకలం రేపింది. నిర్భయపై కీచకులు దారుణంగా ప్రవర్తించారు. సున్నితమైన ప్రాంతంలో దాడి చేయడంతో.. ఆమె చికిత్స పొందుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దిగువ కోర్టు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే శిక్ష అమలులో జాప్యం జరుగుతుంది. సాధారణంగా ఉరిశిక్ష విధిస్తే.. కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో విచారణకు వస్తోంది. అక్కడ కూడా సానుకూలంగా రాకుంటే గవర్నర్, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరతారు. వారు కూడా కరుణించకుంటే ఉరిశిక్షను అమలు చేస్తారు.

నిర్భయ కేసులో దోషులు ఉరిశిక్షను సవాల్ చేసే అవకాశం ఉంది. కానీ వారెవరే దరఖాస్తు చేయలేదు. గవర్నర్, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరలేదు. ఉరి శిక్షకు సంబంధించి సమాచారం వారికి అందజేశామని తెలిపారు. గడువు తేదీలోగా నిందితులు క్షమాభిక్ష కోరాలని లేదంటే న్యాయస్థానానికి సమాచారం అందజేస్తామని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఉరిశిక్ష అమలు చేస్తామని తీహర్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ తెలిపారు. నిర్భయ దోషుల్లో ముగ్గురు తీహార్ జైలులో ఉండగా మరొకరు మండొలి జైలులో ఉన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications