PM: రౌడీషీటర్ కు నమస్కారం చేసి ప్రధాని పదవిని అవమానించిన మోదీ, ఓరి మల్లిగా ఎంతపని జరిగిందిరా ?
ప్రధాని నరేంద్ర మోదీ ఓ రౌడీషీటర్ కు ఎదురుగా నిలబడి నమస్కారం చేశారని, మోదీ ప్రధాని పదవికే మచ్చ తెచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.
బెంగళూరు/మండ్య/మైసూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఓ రౌడీషీటర్ కు ఎదురుగా నిలబడి నమస్కారం చేశారని, మోదీ ప్రధాని పదవికే మచ్చ తెచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. మోదీ తీరును తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ మల్లికార్జున్ అనే వ్యక్తికి నమస్కారం చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక బీజేపీ నాయకులతో పాటు ప్రధాని మోదీని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తోంది. అయితే మల్లిగాడు కొంప ముంచాడు అని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు.

ప్రధాని మోదీ టూర్ గ్రాండ్ సక్సస్
ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చెయ్యడానికి, బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ హైవే రహదారిని ప్రారంభించడానికి ఆదివారం కర్ణాటకకు వచ్చిన విషయం తెలిసిందే. మండ్య, ధారవాడలో ప్రధాని నరేంద్ర మోదీ వివిద కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం అయ్యిందని బీజేపీ నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా చాలా సంతోషంగా కర్ణాటక నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు.

ఎన్నికల టైమ్ లో బీజేపీకి ?
కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన మీద కన్ను వేసిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకుల మీద డేగకన్ను వేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చాన్స్ కోసం ఎదురు చూసిందో అలాంటి చాన్స్ చిక్కడంతో ఇప్పుడు బీజేపీతో ఆడుకుంటున్నారు.

3. వాడికంటేనా
ప్రధాని మోదీకి స్వాగతం పలికిన బీజేపీ నాయకులు
బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ హైవే రహదారి ప్రారంభోత్సవం కోసం మండ్యకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఆ సందర్బంలో బీజేపీ నాయకులతో పాటు మల్లికార్జున్ అలియాస్ ఫైటర్ రవి అనే వ్యక్తి ఉన్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక బీజేపీ నాయకులతో పాటు మల్లికార్జున్ కు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ మల్లికార్జున్ అలియాస్ ఫైటర్ రవికి నమస్కారం చేస్తున్న ఫోటో కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతికి చిక్కడంతో ఆప్పుడు ఆ పార్టీ నాయకులు ఆట మొదలుపెట్టారు.

రౌడీషీటర్ కు నమస్కారం చేసి ప్రధాని పదవి పరువు తీశారు
ప్రధాని నరేంద్ర మోదీ నమస్కారం చేసిన వ్యక్తి పేరు మల్లికార్జున్ అలియాస్ ఫైటర్ రవి, అతను ఓ పెద్ద రౌడీషీటర్, రౌడీలకు మా పార్టీలో స్థానం లేదని గొప్పగా చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు ఇప్పుడు ఏకంగా రౌడీషీటర్ మల్లికార్జున్ ను ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టారని కాంగ్రెస్ పార్టీ ట్విట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఓ రౌడీషీటర్ కు నమస్కారం చేసి ప్రధాని పదవి పరువు తీశారని విమర్శించిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఫోటోలు సోషట్ మీడియాలో వైరల్ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి
గత రెండు సంవత్సరాల నుంచి మల్లికార్జున్ అలియాస్ ఫైటర్ రవి మండ్య జిల్లాలోని నాగమంగల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మంచినీటిని సరఫరా చేస్తూ పలువురికి సహాయం చేస్తూ రాజకీయాల్లో ఉంటున్నారు. మల్లికార్జున్ అలియాస్ ఫైటర్ రవి మాజీ రౌడీషీటర్. గత ఏడాది నవంబర్ 28వ తేదీన మంత్రి అశ్వథ్ నారాయణ సమక్షంలో నారాయణగౌడ, గోపాలయ్య, ఫైటర్ రవితో పాటు మండ్య ఎంపీ సుమలతకు ఎంతో నమ్మకస్తుడు అయిన సచ్చిదానంద బీజేపీలో చేశారు. అప్పటి నుంచి ఫైటర్ రవి బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు.

ఓరి మల్లిగా ఎంతపని జరిగింది ?
ప్రపంచంలోనే నీచమైన రాజకీయాలు చేసే రాజకీయ పార్టీగా బీజేపీ గుర్తింపు తెచ్చుకుంటున్నదని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. రౌడీషీటర్ ఎదురుగా నిలబడిన ప్రధాని నరేంద్ర మోదీ అతనికి నమస్కారం చేసి ప్రధాని పదవికి మచ్చ తెచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలతో ఓరి మల్లిగా నీవల్ల ఎంతపని జరిగిపోయిందిరా అంటూ ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications