రోడ్డు ప్రమాదంలో సాఫ్టువేర్ ఇంజనీర్ మృతి
బెంగళూరు: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సాఫ్టువేర్ ఇంజనీర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన ప్రతాప్ జే బాలన్ (23) బెంగళూరు చేరుకుని విప్రో కంపెనీలో సాఫ్టువేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు.
మంగళవారం రాత్రి 11.45 గంటల సమయంలో విధులు ముగించుకుని స్నేహితుడు ప్రసన్నతో కలిసి బైక్ పైన ఇంటికి బయలుదేరాడు. మార్గమద్యలో పరప్పన అగ్రహార సమీపంలోని కేఎస్ఆర్ పీ 9వ బెటాలియన్ కార్యాలయం దగ్గర ఓ లారీని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో బైక్ అదుపు తప్పి ఇద్దరు కిందపడ్డారు.
ఆ సమయంలో అదే లారీ వారి మీద దూసుకెళ్లింది. తీవ్రగాయాలైన బాలన్ దుర్మరణం చెందాడు. తీవ్రగాయాలైన ప్రసన్న స్పర్శ్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు.

యువకుడి దారుణ హత్య!
టీ తాగడానికి వెళ్లిన యువకుడు హత్యకు గురైన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. కాక్స్ టౌన్‌లోని దోడ్డగుంటే ప్రాంతంలో మధు (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో లెమన్ ట్రీ హోటల్లో టీ తాగడానికి వెళ్లాడు.
ఆ సమయంలో అక్కడ ఉన్న యువకులు మధుతో గొడవ పడ్డారు. సహనం కోల్పోయిన నిందితులు డ్రాగెన్ తీసుకుని మధును దారుణంగా పొడిచి, పరారయ్యారు. తీవ్రగాయాలైన మధును బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications