కోపమొచ్చి జడ్జి పైకి మొబైల్ విసిరిన మహిళ, అరెస్టు

శరణ్ జిల్లా సోనేపూర్‌లోని అలాఉద్దీన్ చౌక్‌కు చెందిన రీటా సింగ్ తన బంధువులకు విధించిన బెయిల్ రద్దు చేయాలని పాట్నా సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత వారం రోజులుగా ఈ బెయిల్ రద్దు విషయమై ఆమె కోర్టు చుట్టూ తిరుగుతోంది. శుక్రవారం ఈ బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు వచ్చింది.
అయితే, ఆమె పిటిషన్‌ను జిల్లా కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆగ్రహోద్రురాలైన రీటా సింగ్ తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను న్యాయమూర్తి మీదకు విసిరింది.
ఆమె విసిరిన మొబైల్ ఫోన్ న్యాయమూర్తి ఎదుట ఉన్న బెంచ్ పైన పడింది. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె పైన పిర్‌బాహర్ స్టేషన్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. రీటా సింగ్‌ను కోర్టులో ప్రవేశ పెట్టి, అనంతరం జైలుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications