డగ్ర్స్ విక్రయం: గూండా యాక్ట్ కింద తొలిసారి ఓ మహిళ అరెస్ట్

బెంగళూరు: డ్రగ్స్ సరఫరా చేస్తున్న మహిళను మొదటి సారి గూండా చట్టం కింద బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని యశవంతపుర సమీపంలోని షరీఫ్ నగరలో నివాసం ఉంటున్న ఫరీదా అలియాస్ ఫరీదా షరీఫుల్లా (55) అనే మహిళను అరెస్టు చేశామని బెంగళూరు నగర అడిషనల్ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ తెలిపారు.

కర్ణాటకతో పాటు బెంగళూరు నగరంలో డగ్ర్ విక్రయిస్తు గూండా యాక్ట్ కింద అరెస్టు అయిన మొదటి మహిళ ఫరీదా. ఫరీదా ఇతర రాష్ట్రాల నుండి బెంగళూరుకు డగ్స్ , గంజాయి తీసుకు వస్తున్నది. తరువాత యశవంతపురంలోని ఇంటిలో గంజాయి, డ్రగ్స్ చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేస్తున్నది. ఫరీదాకు ముబారక్, జంషిద్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

 Woman booked under Goonda Act

డగ్స్, గంజాయి ప్యాకెట్లు ఇద్దరు కొడుకుల దగ్గరకు ఇచ్చి తాను చెప్పిన చోట ఇవ్వాలని ఫరీదా సూచించేది. అంతే కాకుండా ఫరీదా ఈ డ్రగ్స్ ప్యాకెట్లు సరఫరా చేసేది. బెంగళూరు నగరంలో ప్రసిద్ది చెందిన కాలేజ్ లు, పార్క్ లు, హొటల్స్, మాల్స్, సినిమా థియేటర్స్, రైల్వే స్టేషన్స్ తదితర ప్రాంతాలలో డ్రగ్స్ విక్రయించేవారు.

శ్రీమంతులు అయి ఉండి విలాసంవతమైన జీవితానికి అలవాటు పడిన విద్యార్థులను వీరు టార్గెట్ చేసుకుని డ్రగ్స్ వి క్రయించేవారని పోలీసులు చెప్పారు. గత 15 సంవత్సరాల నుండి ఫరీదా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నది. ఈమె మీద అనేక కేసులు నమోదు అయ్యాయి. డగ్స్ విక్రయిస్తు అరెస్టు అయిన ఫరీదా ఇప్పటి వరకు 10 సార్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చింది. ఇంకా అనేక కేసులు విచారణలో ఉన్నాయి. ఫరీదాను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+