సాంబార్ రుచిగా లేదని భర్త, అత్త తిట్టారు: బెంగళూరులో మహిళ ఆత్మహత్య !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: సాంబార్ సరిగా చెయ్యలేదని, తినడానికి రుచిగా లేదని అత్త, భర్త తిట్టారని జీవితంపై విరక్తి చెందిన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని కూనప్పన అగ్రహార (కేపీ అగ్రహార) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

కేపీ అగ్రహారలోని చోళూరుపాళ్య ప్రాంతంలో శ్రీనివాస్, నాగరత్న దంపతులు నివాసం ఉంటున్నారు. 28 ఏళ్ల కిత్రం శ్రీనివాస్, నాగరత్నకు వివాహం జరిగింది. శ్రీనివాస్, నాగరత్న దంపతులకు మిథున్ అనే కుమారుడు ఉన్నాడు. శుక్రవారం రాత్రి ఇంటిలో అందరూ భోజనం చెయ్యడానికి కుర్చున్నారు.

Woman committed suside by hanging in Bengaluru

నాగరత్న భర్త శ్రీనివాస్ తో పాటు అత్త, కుమారుడు మిథున్ భోజనం వడ్డించారు. ఆ ససందర్బంలో సాంబార్ రుచిగా లేదని, ఇలాగేనా వంటలు చేసేది అంటూ నాగరత్న మీద ఆమె భర్త శ్రీనివాస్, అత్త మండిపడ్డారు. ఒక్క రోజు సాంబార్ రుచిగా లేదని అందరి ముందు తిట్టారని జీవితంపై విరక్తి చెందిన నాగరత్న తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. నాగరత్న కుమారుడు మిథున్ వెళ్లి చూడగా ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Housewife committed suside by hanging in KP Agrahara in Bengaluru.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X