రైలుకు, ప్లాట్‌ఫాం మధ్య చిక్కుకొని మహిళ మృతి

కాన్పూర్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ రైలును దిగేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్యలో చిక్కుకుపోయింది. వెంటనే రైలును ఆపేశారు. ఆమెను లాగేందుకు విఫల యత్నం చేశారు. దీంతో ప్లాట్ ఫాంను పగులగొట్టారు. ఆమె మృతి చెందింది.
కాగా, తన కూతురును ఎవరో తోయడంతో కిందపడిందని మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు. మరోవైపు కదులుతున్న రైలు నుండి ఆమె దిగే ప్రయత్నాలు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని రైల్వే వర్గాలు అంటున్నాయి.
రైలు ఆగకముందే ఆమె దిగే ప్రయత్నాలు చేశారని, దీంతో ఆమె చిక్కుకుపోయిందని, ప్లాట్ ఫాంను పగులగొట్టి తాము ఆమెను బయటకు తీశామని రైల్వే అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications