నంది హిల్స్‌లో యువతి ఆత్మహత్య, 2 వేల అడుగుల ఎత్తునుంచి దూకి, ముక్కలైన దేహం!

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరుకు 50 కిలోమీటర్ల దూరంలోని నంది హిల్స్‌లో 2 వేల అడుగుల ఎత్తు నుంచి ఓ మహిళ కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. కోలారు జిల్లాకు చెందిన శ్వేత(31) ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.

కోలారు జిల్లాలోని మాలూరులో నివాసం ఉంటున్న శ్వేత బుధవారం చిక్కబళ్లాపురం జిల్లాలోని నంది హిల్స్‌కు వెళ్లింది. అక్కడ కొండ మీద పలు ప్రాంతాల్లో సంచరించింది. నంది హిల్స్‌లోని టిప్పు డ్రాప్ అనే సూసైడ్ పాయింట్ దగ్గరకు వెళ్లింది. తరువాత ఏం ఆలోచించకుండా అక్కడ్నించి దూకేసింది.

Woman jumped from Tippu drop in Nandi hills near Bengaluru

విషయం గుర్తించిన పర్యాటకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది గురువారం మధ్యాహ్నం వరకు శ్రమించి అతి కష్టం మీద శ్వేత మృతదేహాన్ని రెండు వేల అడుగుల కింద 38వ క్రాస్ దగ్గర గుర్తించారు. శ్వేత మృతదేహం ముక్కలు ముక్కలైనట్లు పోలీసులు చెప్పారు. శ్వేత ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని వారు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+