సెల్ ఫోన్ ధ్యాసలో పాముల మీదే కూర్చున్న మహిళ!

లక్నో: సెల్ ఫోన్ గేములు, సెల్ఫీల ధ్యాసలో పడి ప్రమాదావశావత్తూ మరణించిన వారి జాబితా కాస్త పెద్దదే. గేమ్ ఆడే సమయంలో సెల్ ఫోన్ హ్యాండ్ సెట్ హీటెక్కి పేలిపోయిన ఘటనలు, సెల్ఫీలు తీసుకుంటూ రైలు కింద పడటం,, నీటిలో కొట్టుకుని పోవటం వంటి సందర్భాలు చాలా చోటు చేసుకున్నాయి. వాటన్నింటి కంటే భిన్నంగా ఓ మహిళ మరణించింది. సెల్ ఫోన్ ధ్యాసలో పడ్డ ఆమె మహిళ తన ఇంట్లోకి రెండు పాములు ప్రవేశించిన విషయాన్ని కూడా గమనించలేదు. ఫోన్ లో మాట్లాడుతూ.. నేరుగా వాటి మీదే కూర్చుంది. అవి ఊరుకుంటాయా? కాటేశాయి. ఫలితంగా- నిమిషాల వ్యవధిలో ఆమె మరణించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది.

మృతురాలి పేరు గీత. గోరఖ్ పూర్ శివార్లలోని రియాన్వ్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త జైసింగ్ యాదవ్ ఏడాదిగా ఉద్యోగ రీత్యా థాయ్ లాండ్ లో నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి థాయ్ లాండ్ నుంచి జైసింగ్ యాదవ్ ఫోన్ చేశారు. ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో రెండు పాములు ఇంట్లోకి ప్రవేశించాయి. పైకప్పు మీది నుంచి జారి అవి మంచం మీద పడ్డాయి.

woman sits on snakes while on call with husband, gets bitten and dies in Uttar Pradesh

వాటిని గీత గమనించలేదు. సెల్ ఫోన్ లో జైసింగ్ యాదవ్ తో మాట్లాడుతూ నేరుగా వెళ్లి పాముల మీద కూర్చున్నారు. అంతే. వెంటనే ఆ రెండూ ఆమెను కాటేశాయి. కొద్ది క్షణాలకే ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు గీతను గోరఖ్ పూర్ లోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+