పెళ్లి చేసుకుంటానని.. ఏడాదిగా పలుమార్లు టీనేజ్ గర్ల్‌పై రేప్

ముంబై: మహారాష్ట్రలో ఓ టీనేజ్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డారు. వాలివ్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇరవయ్యేళ్ల గోత్యాగా గుర్తించినట్లు చెప్పారు. బాధితురాలి వయస్సు 15 ఏళ్లు. వీరిద్దరు కూడా వాలివ్ గ్రామానికి చెందిన వారే.

ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఆ బాలికను నిందితుడు నమ్మించాడు. గత ఏడాదిగా పలుమార్లు ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకు అతను పెళ్లికి నిరాకరించాడు. బాలిక నాలుగు నెలల గర్భిణి. ఈ విషయం తెలిసిన తర్వాత.. ఆమె వెళ్లి పెళ్లి చేసుకోవాలని అడగటంతో నిరాకరించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రెండు నెలల్లో 3వందల రేప్‌లు!

Youth rapes minor girl

దేశ రాజధాని ఢిల్లీ మహిళలపై నేరాలకు అడ్డాగా మారిందనే చేదునిజాన్ని పోలీసుల రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే సుమారు 300 రేప్ కేసులను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. 500కు పైగా లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.

అయితే మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి నమోదయిన కేసుల సంఖ్య పెరగడం సానుకూల పరిణామమేనని పోలీసులు పేర్కొంటున్నారు. గతంలో మహిళలు తమపై నేరాలు జరిగినా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేవారు కాదని, ఇప్పుడు అలా కాకుండా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని, అందుకే కేసుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+