నేరం ఒప్పుకున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. పక్కా ప్లాన్‌తో స్కెచ్
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశానికి వెన్నుపోటు పొడిచిన విషయం వెలుగులోకి వచ్చింది. భారత సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ సభ్యులకు చేరవేసినట్లు అంగీకరించింది. తొలుత ఎన్ఐఏ, ఐబీ అధికారులను బురిడీ కొట్టించడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె వాట్సాప్ చాట్‌లు, డైరీ ఆధారాలను చూపించడంతో నిజం ఒప్పుకుంది.
2023లో పాకిస్తాన్‌ను సందర్శించిన జ్యోతి, అక్కడ 10 రోజులు గడిపినట్లు విచారణలో తేలింది. ఈ పర్యటన గురించి ఆమె తండ్రికి ఢిల్లీకి వెళ్తున్నానని అబద్ధం చెప్పింది. పాకిస్తాన్ పట్ల తనకున్న అభిమానాన్ని డైరీలో రాసుకుంది. అంతేకాకుండా, పహల్గాం ఘటనకు మూడు నెలల ముందు కూడా జ్యోతి అక్కడికి వెళ్లిందని, అక్కడి సమాచారాన్ని కూడా పాకిస్తాన్‌కు చేరవేసిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పహల్గాం ఘటన తర్వాత, బ్లాక్ అవుట్, పంజాబ్-హర్యానా సరిహద్దు వద్ద భద్రతా బలగాల మోహరింపు వంటి కీలక సమాచారాన్ని వీడియోల రూపంలో తీసి, సీక్రెట్ కోడ్‌లో పాకిస్తాన్‌కు పంపినట్లు బయటపడింది.

పాకిస్తాన్ ఎంబసీకి చెందిన డానిష్‌తో జ్యోతికి ఎఫైర్ ఉందని, లగ్జరీ జీవితం ఆశచూపి ఆమెను వాడుకున్నారని తేలింది. పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు అలీహసన్, షాకిర్ (జట్ రంధావా), రాణా షహబాజ్ వంటి పలువురిని కలిసింది. వీరందరితో జ్యోతి భారత సున్నిత సమాచారాన్ని పంచుకున్నట్లు ఏజెన్సీలు గుర్తించాయి. వాట్సాప్, స్నాప్‌చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్ ఏజెంట్లతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు, దేశానికి సంబంధించిన సమాచారాన్ని పంపినట్లు ఆమె అంగీకరించింది.
ఈ నేపథ్యంలో, యూట్యూబర్ జ్యోతితో సహా 11 మందిపై దేశద్రోహం కేసు నమోదైంది. దేవేంద్ర సింగ్ దిల్హన్, తారిఖ్, నౌమన్ ఇల్లహి, అర్మన్, షహజాద్, మహ్మద్ ముర్తాజా అలీ, గజాలా, యామిన్ మహ్మద్, సుఖ్‌ప్రీత్ సింగ్, కరన్‌బీర్ సింగ్ లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు. వీరిపై ఏజెన్సీలు విచారణ కొనసాగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications