26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి: డేవిడ్ హెడ్లీపై దాడి, పరిస్థితి విషమం
చికాగో: 26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ప్రస్తుతం తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అమెరికాలోని చికాగో జైల్లో తోటి ఖైదీలు అతడిపై దాడికి దిగారు. దీంతో హెడ్లీ తీవ్రంగా గాయపడ్డాడు.
జైలు అధికారులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా ఐసీయూలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు లష్కరే తొయిబా ఉగ్రవాదులు జరిపిన వరుస దాడుల్లో 164 మంది ప్రాణాలు కోల్పోయారు. 308 మంది గాయాలపాలయ్యారు. ఈ పేలుళ్ల ప్రధాన సూత్రదారుల్లో డేవిడ్ హెడ్లే ఉన్నాడు.












Click it and Unblock the Notifications