దారుణం: గొలుసులతో కట్టేసి, తిండిపెట్టక పిల్లలకు తల్లిదండ్రుల చిత్రహింసలు
కాలిఫోర్నియా: కన్నపిల్లల్నే హింసిస్తున్న తల్లిదండ్రులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లోనే 13 మందిని ఇంట్లోనే గొలుసులతో కట్టేసి కనీసం ఆహరం కూడ సక్రమంగా ఇవ్వలేదు. తీవ్రంగా నీరసించిన పిల్లలు ఎట్టకేలకు బయటపడ్డారు. పిల్లలను బంధించిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పిల్లలకు స్వేఛ్చ లబించింది. అయితే ఇంటి నుండి ఓ బాలిక తప్పించుకొని పోలీసులకు ఫోన్ చేయడంతో వారికి విముక్తి లభించింది.
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డేవిడ్ అలెన్ టర్పిన్, లూయాస్ అన్నా టర్పిన్ దంపతుల ఇంట్లో 13 మంది పిల్లలు బందీలుగా ఉన్నారు. రెండేళ్ళ నుండి 29 ఏళ్ళ వయస్సున్న పిల్లలు ఇందులో ఉన్నారు.

ఈ దంపతులు 13 మందిని ఇంట్లో బంధించి ఆహారం సరిగ్గా పెట్టకుండా చాలా హింసించారు. కొందరిని చీకటి గదుల్లో గొలుసులతో బంధించారు. అయితే బంధించిన వారిలో 17 ఏళ్ల అమ్మాయి ఇంటి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగు చూసింది.
పెర్రిస్‌లోని ఇంట్లో బాగా నీరసించిపోయి పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల్ని గుర్తించిన అనంతరం పోలీసులు ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
కొందరు పిల్లల్ని చీకటిలో మంచాలకు గొలుసులతో కట్టేసి ఉంచారు., వారి చుట్టూ బాగా మురికి, చెడు వాసన వస్తూ ఉందని పోలీసులు వెల్లడించారు.
బందీలుగా ఉన్న వారిలో ఏడుగురిది 18 నుంచి 29 ఏళ్ల వయసు అని తెలిసి షాక్‌కు గురయ్యామని, పోషకాహార లోపంతో చాలా చిక్కిపోయి ఉండడమే కాకుండా బాగా మురికిగా ఉన్నారని తెలిపారు.
ఆకలితో అలమటించిపోతున్న వారికి వెంటనే ఆహారపానీయాలు అందించినట్లు తెలిపారు. అసలు పిల్లల్ని వారు ఎందుకు అలా హింసించారనే విషయమై అర్ధం కాలేదని పోలీసులు చెప్పారు. ఈ విషయమై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications