భారీ ఉగ్రదాడి.. కాన్వాయ్‌పై విరుచుకుపడ్డ టెర్రరిస్టులు

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో భారీ ఉగ్రదాడి చోటు చేసుకుంది. చైనాకు చెందిన ఇంజినీర్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కాల్పులకు తెగబడ్డారు. ఈ మెరుపుదాడిలో పలువురు ఇంజినీర్లు, సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. అనంతరం భద్రత బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఈ మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. ఈ ప్రావిన్స్‌లోని పోర్ట్ సిటీ గ్వాడర్‌ సమీపంలోని ఫకీర్ బ్రిడ్జి వద్ద చైనా ఇంజినీర్ల కాన్వాయ్ వెళ్తోన్న సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. బలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ సాయుధ బలగాలు.. ఈ దాడికి పాల్పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పోలీసులు మాత్రం దీన్ని ఉగ్రదాడిగా భావిస్తోన్నాయి.

Convoy of Chinese engineers was attacked in Pakistan

పాకిస్తాన్- చైనా మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయనే విషయం తెలిసిందే. పాకిస్తాన్‌లో భారీగా పెట్టుబడులను పెట్టింది చైనా. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌ను నిర్మిస్తోంది. దీనికోసం డ్రాగన్ కంట్రీ పెట్టిన పెట్టుబడి విలువ 60 మిలియన్ డాలర్లు. ప్రస్తుతం ఈ ఎకనమిక్ కారిడార్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

చైనాకు చెందిన ఇంజినీర్లు ఈ నిర్మాణ పనుల్లో చురుగ్గా పాల్గొంటోన్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఈ కారిడార్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం విధులను ముగించుకుని వెళ్తోన్న ఇంజినీర్ల కాన్వాయ్‌పై బలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ సాయుధ బలగాలు కాల్పలకు తెగబడ్డాయి. ఫకీర్ బ్రిడ్జి వద్దకు కాన్వాయ్ చేరుకోగానే ఒక్కసారిగా బుల్లెట్ల వర్షాన్ని కురిపించాయి.

చైనా ఇంజినీర్లపై దాడులు జరగొచ్చనే ఉద్దేశంతో వారికి పెద్ద ఎత్తున భద్రతను కల్పించింది పాకిస్తాన్ ప్రభుత్వం. పైలెట్ సహా భద్రత బలగాలతో ప్రత్యేకంగా కాన్వాయ్‌ను ఏర్పాటు చేసింది. ఈ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని బలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ కాల్పులకు దిగింది. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని ఇద్దరు సిబ్బంది, ఇంజినీర్లు గాయపడ్డారు.

ఈ ఘటన పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. గ్వాడర్‌లో చైనా నిపుణుల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు పాకిస్తాన్ సెనెటర్ సర్ఫరాజ్ బుగ్టి తెలిపారు. సకాలంలో సెక్యూరిటీ సిబ్బంది స్పందించారని, ఎదురు కాల్పులు జరిపి, వారిని తరిమి కొట్టారని, ప్రాణనష్టాన్ని నివారించగలిగారని అన్నారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+