భారత్‌పై ఆగని చైనా కుట్రలు: సముద్రంలోకి భారీ నిఘా నౌక, క్షిపణి ప్రయోగం వాయిదా
న్యూఢిల్లీ/బీజింగ్: భారత్‌పై చైనా తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. భారత్ చేపడుతున్న రక్షణకు సంబంధించిన ప్రయోగాలపై చైనా కుయుక్తులు పన్నుతోంది. అయితే, చైనా కుట్రలపై భారత్ కూడా డేగ కన్ను వేసి ఉంచింది. ఈ క్రమంలోనే హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించిన చైనా నిఘా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది.
చైనా నిఘా నౌక కారణంగా భారత కీలక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం వాయిదా వేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. కాగా, నవంబర్ 10-11న ఓ దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు భారత్ ఇటీవల నోటీమ్ (నోటీస్ టు ఎయిర్‌మెన్) జారీ చేసింది. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నట్టేందుకు సిద్ధమైంది.
#AreaWarning #India issues a notification for a no fly zone over the Bay of Bengal region indicative of upcoming missile test
— Damien Symon (@detresfa_) October 22, 2022
Launch Window | 10 - 11 Nov 2022 pic.twitter.com/XqXVR2j9Y3
2,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్షిపణి పయనం.. శ్రీలంక, ఇండోనేషియా మధ్య ఉన్న ప్రాంతంలో సాగనుంది. ఈ క్రమంలో, భారత్ నోటీసు జారీ చేసిన కొద్ది రోజులకే చైనాకు చెందిన యువాన్ వాంగ్-6 అనే భారీ నౌక హిందూ మహా సముద్రంలో ప్రవేశించింది. శుక్రవారం ఉదయం ఈ నౌక ఇండోనేషియాలోని బాలి తీరం నుంచి బయల్దేరింది. ఇది పరిశోధనా నౌక అని డ్రాగన్ చెబుతున్నప్పటికీ.. అయితే, దీనికి క్షిపణి పరీక్షలు, ఉపగ్రహాల కదలికలను పరిశీలించే సామర్థ్యం ఉన్నట్లు సమాచారం.

భారత క్షిపణి ప్రయోగానికి కొద్ది రోజుల ముందే ఈ నౌకను చైనా హిందూ మహా సముద్రంలోకి పంపించడంతో.. మన క్షిపణి ప్రయోగం, ఆయుధ సామర్థ్యంపై కన్నేసి ఉంచేందుకే ఈ చర్య చేపట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే క్షిపణి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
అంతేగాక, చైనా నౌక కదలికలను సునిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు భారత నావికా దళ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం ఓ మిషన్ కూడా కొనసాగుతోందని వెల్లడించాయి. ఇది ఇలావుండగా, ఈ ఏడాది ఆగస్టులోనే చైనాకు చెందిన ఓ నిఘా నౌక యువాన్ వాంగ్-5 శ్రీలంకలోని హంబన్ టోట రేపులో లంగరేయడం వివాదాస్పదంగా మారింది. భారత్ దీనిపై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. పట్టించుకోని శ్రీలంక సర్కారు.. చైనా నౌకకు అనుమతిచ్చింది. భారీ మొత్తంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించుకోకపోవడంతో ఈ రేవును శ్రీలంక.. చైనాకు 99 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో చైనా.. శ్రీలంక తీరాన్ని ఉపయోగించుకుంటుండటం భారత్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది.












Click it and Unblock the Notifications