గ్రీన్‌లాండ్ కోసం ట్రంప్ పట్టు.. డెన్మార్క్ ఎంపీ నోట పచ్చి బూతులు! (వీడియో)
గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వెనిజులాలో విజయవంతమైన సైనిక చర్య తర్వాత డొనాల్డ్ ట్రంప్ కన్ను ఇప్పుడు ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న ఆర్కిటిక్ ప్రాంతం గ్రీన్‌లాండ్‌పై పడింది. ఈ నేపథ్యంలో గతేడాది డెన్మార్క్ ఎంపీ ఒకరు ట్రంప్‌ను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి.
ట్రంప్‌కు డానిష్ ఎంపీ ఘాటు హెచ్చరిక
2025 జనవరిలో యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు ఆండర్స్ విస్టిసెన్.. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తానన్న ట్రంప్ ప్రతిపాదనపై తీవ్రంగా స్పందించారు. పార్లమెంటు వేదికగా ఆయన మాట్లాడుతూ.. "మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్, జాగ్రత్తగా వినండి. గ్రీన్లాండ్ 800 ఏళ్లుగా డెన్మార్క్ రాజ్యంలో అంతర్భాగంగా ఉంది. ఇది మా దేశంలో ఒక భాగం.. ఇది అమ్మకానికి లేదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. 'మిస్టర్ ట్రంప్.. ఫ* ఆఫ్' (f*** off)**" అంటూ అత్యంత కఠిన పదజాలంతో విమర్శించారు.

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ ఎందుకు పట్టుబడుతున్నారు?
ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే గ్రీన్‌లాండ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. 2019లో డెన్మార్క్ ఈ ప్రతిపాదనను తిరస్కరించినందుకు ఆయన తన పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి గ్రీన్‌లాండ్ అమెరికాకు కీలకమని ట్రంప్ భావిస్తున్నారు. గ్రీన్‌లాండ్‌లో అపారమైన ఖనిజ సంపద ఉంది. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. "ఏదో ఒక రకంగా" గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆధీనంలోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
An old message from Danish Anders Vistisen is going viral again amid Trump’s renewed threats over Greenland pic.twitter.com/atwhk4ZAR1
— Continental Labs (@continentallabs) January 13, 2026
డెన్మార్క్, గ్రీన్‌లాండ్ స్పందన
డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సెన్, గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్-ఫ్రెడరిక్ నీల్సన్ ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. మంగళవారం కోపెన్‌హాగన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో గ్రీన్‌లాండ్ ప్రధాని నీల్సన్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం భౌగోళిక రాజకీయ సంక్షోభం నెలకొంది. అమెరికా, డెన్మార్క్‌లలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే.. మేము డెన్మార్క్‌నే ఎంచుకుంటాము. మేము నాటో (NATO), ఈయూ (EU), డెన్మార్క్ రాజ్యానికే కట్టుబడి ఉంటాం" అని స్పష్టం చేశారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. "అది వారి సమస్య. నాకు నీల్సన్ ఎవరో తెలియదు, కానీ అది అతనికి పెద్ద సమస్యగా మారబోతోంది" అని హెచ్చరించారు.
అంతర్జాతీయ పరిణామాలు
డెన్మార్క్ నాటోలో వ్యవస్థాపక సభ్య దేశం. గ్రీన్‌లాండ్ రక్షణ బాధ్యతలు నాటో పరిధిలోకి వస్తాయి. ఒకవేళ అమెరికా బలవంతంగా గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవాలని చూస్తే, అది నాటో దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications