వట్టిదే, భూమికి ఆస్టరాయిడ్ ప్రమాదం లేదు: నాసా
వాషింగ్టన్: వచ్చే నెలలో (సెప్టెంబర్) భూమిని ఆస్టరాయిడ్‌లు (గ్రహశకలం) ఢీకొంటుందనే ప్రచారం జరుగుతోంది. దీని పైన నాసా స్పందించింది. ప్రమాదకరమైన ఆస్టరాయిడ్లు భూమిని తాకే అవకాశాలు రానున్న వంద ఏళ్లలో 0.01 శాతం మాత్రమే ఉందని చెప్పారు.
సెప్టెంబర్ నెల 15, 28 తేదీల మధ్య కాలంలో భారీ గ్రహశకలం ఒకటి భూమిని తాకి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించవచ్చంటూ వచ్చిన వార్తలను నాసా కొట్టి పారేసింది. ఆ నెలలో ఖగోళానికి చెందిన వస్తువేదీ మన భూమిని ఢీకొడుతుందని చెప్పడానికి ఒక్క ఆధారమూ లేదని చెప్పింది.
సెప్టెంబర్ 15 నుంచి 28 మధ్య కాలంలో భారీ గ్రహశకలం ఒకటి భూమిని ఢీకొట్టవచ్చంటూ ఇటీవలి కాలంలో లెక్కలేనన్ని బ్లాగ్‌లు, వెబ్‌లలో తప్పుడు కథనాలు వచ్చాయని నాసా పేర్కొంది.

ఆ తేదీల్లో ఒక రోజున పోర్టారికో సమీపంలో గ్రహ శకలం భూమిని ఢీకొంటుందని, దాని ఫలితంగా అమెరికా, మెక్సికోలలోని అట్లాంటిక్ గల్ఫ్ తీరాలకు, అలాగే మధ్య, దక్షిణ అమెరికాలకు భారీ నష్టం సంభవించవచ్చని ఆ కథనాలు పేర్కొన్నాయి.
అయితే ఆ తేదీల్లో గ్రహ శకలం కానీ లేదా ఏదైనా ఖగోళ వస్తువు కానీ భూమిని తాకుతుందనేందుకు ఆధారాలు లేవని చెప్పింది. అంతేకాదు భూమికి దగ్గరగా ఉన్న వస్తువులను గుర్తించే కార్యక్రమం ప్రకారం సమీప భవిష్యత్తులో భూమిని తాకే గ్రహ శకలం కానీ, తోకచుక్క కానీ ఏదీ లేదు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications