చైనాలో విద్యుత్ ప్లాంట్ పేలిపోయింది
బీజింగ్: చైనాలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అత్యంత ఒత్తిడితో కూడిన ఆవిరి గొట్టం పేలడంతో 21 మంది కార్మికులు దుర్మరణం చెందారు. అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు.
చైనాలోని హ్యూబే ప్రావిన్స్ డ్యాంగ్ యాంగ్ నగరంలో మాడియన్ గాంగ్యు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పైప్ ను పరిశీలిస్తున్న సమయంలో ఒక్క సారిగా పేలిపోయింది.

విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించారు. సహాయక చర్యలు చేపట్టి పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. గాయాలైన వారిని డ్యాంగ్ యాంగ్ నగరంలోని ఆసుపత్రులకు తరలించారు.
గత సంవత్సరం ఆగస్టు 12వ తేదిన చైనా ఈశాన్య నగరంలోని తియాన్ జిన్ లో పేలుడు కారణంగా 173 మంది దుర్మరణం చెందారు. కార్మికుల భద్రత గురించి నిర్లక్షం చెయ్యడం వలనే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications