ట్విట్టర్ కంటే ఫేస్‌బుక్‌కే యువత ఓటు, గూగుల్‌లో ట్వీట్స్ చూడొచ్చు
ముంబై: సామాజిక అనుసంధాన వేదికల్లో ఫేస్‌బుక్‌ను యువత ఎక్కువగా వినియోగిస్తోందని, తర్వాత స్థానాల్లో గూగుల్ ప్లస్, ట్విట్టర్ ఉన్నాయని టీసీఎస్ సర్వే పేర్కొంది. మొత్తం 14 పట్టణాల్లో 8 నుండి 12వ తరగతి చదివే పన్నెండు వేల మందికి పైగా విద్యార్థులను ఈ సంస్థ సర్వే చేసింది.
ఫేస్‌బుక్ వినియోగిస్తున్నట్లు 99 శాతం మంది చెప్పారు. గూగుల్ ప్లస్ వినియోగిస్తున్నట్లు 65 శాతం మంది, ట్విట్టర్ ఉపయోగిస్తున్నట్లు 44.1 శాతం మంది చెప్పారు. ఆన్ లైన్ చదువుకు సంబంధించి వికిపిడియాను 63.1 శాతం మంది, పీడీఎఫ్‌లను 50.9 శాతం మంది, ఆన్ లైన్ వీడియోలను 44 శాతం మంది వినియోగిస్తున్నారు.

అరవై ఆరు శాతం మంది తాము ఆన్ లైన్లో విక్రయాలు చేస్తున్నామని, ఎలక్ట్రికల్ పరికరాలు 64.5 శాతం, పుస్తకాలు 61.2 శాతం, టిక్కెట్లు 41.3 శాతం విక్రయిస్తున్నామని సర్వేలో వెల్లడైంది.
గూగుల్లో వెతికితే ట్వీట్స్ కనబడతాయి
ట్వీట్స్ కావాలంటే గూగుల్లోను వెతకవచ్చు. ఇందుకోసం ట్విట్టర్ - గూగుల్ మధ్య ఒప్పందం కుదిరింది. 2009-11 సంవత్సరాలలో ఇరు సంస్థల మధ్య ఇందుకు ఒప్పందం ఉంది. మళ్లీ ఇప్పుడు దానిని పునరుద్ధరించారు.












Click it and Unblock the Notifications