దేవయాని ఇష్యూ: భారత్ ప్రతిచర్య, దౌత్య రక్షణ తగ్గింపు

న్యూఢిల్లీ: దౌత్యవేత్త దేవయాని అరెస్టును తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం కఠినచర్యలు ప్రారంభించింది. అమెరికా దౌత్యవేత్తలు, వారి కుటుంబ సభ్యుల విషయంలో చర్యలు మొదలయ్యాయి. కొన్ని కేటగిరీలకు చెందిన అమెరికా దౌత్యవేత్తలకు మినహాయింపులను తగ్గించడంతో పాటు వారి కుటుంబీకులకు ఇస్తున్న మినహాయింపులను తొలగించింది.

దేశంలోని నాలుగు కాన్సులేట్‌లలో పని చేస్తున్న అధికారులకు కొత్త గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. అంటే ఇప్పటి వరకూ కల్పించిన దౌత్య గుర్తింపు కార్డులను వెనక్కి తీసుకున్నారు. దీని దృష్ట్యా వీరు పాల్పడే నేరాలకు సంబంధించి శిక్షల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదు.

India acts: Withdraws staff I cards

అమెరికాలోని భారత దౌత్య అధికారుల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో అదే పద్ధతిని భారత్‌లోని ఆ దేశ అధికారుల విషయంలో, వారి కుటుంబీకులకు సంబంధించి వ్యవహరిస్తారు. దౌత్యవేత్తల విషయంలో కుదించిన మినహాయింపులు వారి కుటుంబ సభ్యులకు ఇంకెంత మాత్రం వర్తించవు.

ఇక నుంచి అమెరికా కాన్సులేట్ సిబ్బంది తమకు అవసరమైన వాటిని వాు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన మొదటి ఆరునెలల్లోగా దిగమతి చేసుకోవడానికి అనుమతిస్తారు. భద్రతను తగ్గిస్తారన్న ఆందోళనను భారత అధికారులు తోసిపుచ్చారు. వియన్నా ఒప్పందాన్ని కచ్చితంగా అమలు చేస్తామని, గతంలో మాదిరిగా భద్రత కల్పిస్తామని, ట్రాఫిక్ కదలికల్లో మాత్రం మార్పులుంటాయని తెలిపింది.

మాన్‌హట్టన్‌లోని భారత దౌత్యాధికారి కుమార్తె కీర్తికా బిస్వాస్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు. భారత దౌత్యాధికారులకు ఉండే మినహాయింపులు వారి కుటుంబ సభ్యులకు ఉండవని అప్పట్లో అమెరికా స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+