ఏకమైన పాక్, చైనా, టర్కీ.. భారత్ కు మరో ముప్పు.. సంచలన విషయాలు వెల్లడించిన ఆర్మీ డిప్యూటీ చీఫ్

సరిహద్దులో పాకిస్థాన్, చైనాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ ఆర్. సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్, చైనా, టర్కీల మధ్య మిలిటరీ భాగస్వామ్యం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ తక్షణమే వైమానిక సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అత్యాధునిక ఆయుధాల కొరతతో ఆపరేషన్ సింధూర్ సమయంలో కొంత ఇబ్బంది ఎదురైందని భారత్ వెంటనే ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు సమాయత్తం కావాలని సూచించారు.

పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్న కారణంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో పాకిస్థాన్ కు చైనా, టర్కీలు ఆయుధాలు సరఫరా చేసి సపోర్ట్ గా నిలిచాయని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ ఆర్. సింగ్ తెలిపారు. బోర్డర్ లో పాకిస్థాన్, చైనా, టర్కీల మైత్రి చూస్తుంటే ఆందోళనకరంగా ఉందని తెలిపారు. భారత్ వెంటనే అత్యాధునిక ఆయుధ సంపత్తిని పెంచుకోవాలని సూచనలు చేశారు.

"ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ కు చైనా లైవ్ లో ఇంటెలిజెన్స్ రిపోర్టు అందించింది. భారత ఆయుధ సంపత్తి విషయాలు మొత్తం పాక్ కు చైనా చేరవేసింది. పాకిస్థాన్ లో ఏఏ ప్రాంతాల్లో భారత్ దాడులు చేపట్టనుంది అనే కీలక విషయాలు చైనా ఇంటెలిజెన్స్ పాక్ కు ఇచ్చింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ స్వయంగా ఒప్పుకుంది. ఈ ఉదాహరణ చాలు. ఉద్రిక్త పరిస్థితుల్లో చైనా- పాకిస్థాన్ ఎలా కలిసిపోతున్నాయో. ఇది వ్యూహాత్మకంగా భారత్ కు పెను సవాల్ లాంటిది" అని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ ఆర్. సింగ్ పేర్కొన్నారు.

Indian Army Deputy Chief Rahul R Singh Warns of Pakistan-China-Turkey Nexus Urges Air Capability Boost

"భారత్- పాకిస్థాన్ యుద్దంలో టర్కీ పాకిస్థాన్ కు ఫుల్ సపోర్ట్ చేసింది. పాక్ కు బేరఖ్తార్ డ్రోన్ లు సరఫరా చేసింది. అలాగే శిక్షణ పొందిన సైన్యాన్ని కూడా మోహరించింది. దీంతో పాకిస్థాన్ బలంగా భారత్ పై ప్రతి దాడులకు పాల్పడింది. అయితే అత్యాధునిక డ్రోన్ వ్యవస్థ లేకపోవడంతో భారత్ కొంత ఇబ్బంది పడింది. ఈ క్రమంలో అత్యాధునిక ఆయుధాల కొనుగోలు, వైమానిక రంగం బలోపేతం చేసుకోవాలి" అని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ ఆర్. సింగ్ స్పష్టం చేశారు.

ఒకే సరిహద్దులో భారత్ మూడు దేశాలను ఎదుర్కుంటోందని రాహుల్ ఆర్. సింగ్ తెలిపారు. పాకిస్థాన్ ముందుంటే చైనా ఆయుధాలు సరఫరా చేస్తుంది. టర్కీ ఫుల్ సపోర్ట్ చేస్తుందన్నారు. 81 శాతం చైనా ఆయుధాలు పాకిస్థాన్ కు సరఫరా అవుతున్నాయి. చైనా.. పాకిస్థాన్ ను రక్షణ సాంకేతికతకు టెస్టింగ్ గ్రౌండ్ గా వాడుకుంటోందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ లో చైనా తన ఆయుధాలను టెస్టింగ్ చేస్తోందని పాక్ ను లైవ్ ల్యాబ్ గా వాడుకుంటోందని.. భారత్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర డ్రోన్ లు తయారవుతున్న నేపథ్యంలో అలాంటి వాటిని నిలువరించేందుకు సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉండాలని ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ ఆర్. సింగ్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+