వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌తో స్నేహానికి సిద్ధం కానీ: గట్టిగా జవాబు చెప్తామని పాకిస్తాన్ హెచ్చరిక

భారత దేశంతో స్నేహ సంబంధానికి పాకిస్తాన్ ఎప్పుడూ సిద్ధమేనని, చర్చల ద్వారా పరిష్కారాన్ని తామూ కోరుకుంటున్నామని పాక్ కొత్త విదేశాంగ మంత్రి ఆసిఫ్ అన్నారు.

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: భారత దేశంతో స్నేహ సంబంధానికి పాకిస్తాన్ ఎప్పుడూ సిద్ధమేనని, చర్చల ద్వారా పరిష్కారాన్ని తాము కోరుకుంటున్నామని పాక్ కొత్త విదేశాంగ మంత్రి ఆసిఫ్ అన్నారు.

కాశ్మీర్ అంశం కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ విషయంలో తాము రాజీపడమని తేల్చి చెప్పారు. మేం స్నేహానికి సిద్ధంగా ఉన్నప్పటికీ భారత్ మాత్రం తమతో సన్నిహిత సంబంధాలకు ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు.

భారత్‌తో సత్సంబంధాల కోసం మా ప్రయత్నం

భారత్‌తో సత్సంబంధాల కోసం మా ప్రయత్నం

కొన్ని దేశాలతో కలిసి సింధునదీ జలాల పంపకంపై అనవసర వివాదం తీసుకొస్తొందని భారత్‌పై విమర్శలు చేశారు. సరిహద్దు దేశాలతో శాంతికాముకంగా ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. అటు ఆఫ్గానిస్థాన్‌, ఇటు భారత్‌తో సత్సంబంధాల కోసం పాక్‌ యత్నిస్తోందన్నారు.

Recommended Video

Sushma Swaraj takes dig at Sartaj Aziz, Pakistani woman joins her | Oneindia News
గట్టిగా జవాబు చెప్తామని హెచ్చరిక

గట్టిగా జవాబు చెప్తామని హెచ్చరిక

అయితే భారత్‌ మాత్రం ఆఫ్గానిస్తాన్‌తో కలిసి పాకిస్తాన్‌ను దూరంగా ఉంచడాన్ని ఆసిఫ్ ప్రశ్నించారు. దౌత్య సంబంధాల మెరుగుదలకు పాకిస్తాన్ కృషి చేస్తున్నా తమది మెతక దేశమని ఇతరులు భావిస్తే గట్టిగా జవాబు చెబుతామని హెచ్చరించారు.

ఆ శక్తుల చర్యలు ఫలించవు

ఆ శక్తుల చర్యలు ఫలించవు

పాకిస్తాన్ పైన ఎలాంటి దాడులు జరిగినా తిప్పికొట్టే పటిష్టస్థితిలో ఉందన్నారు. పాక్‌ను విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు చేస్తున్న చర్యలు ఎప్పటికీ ఫలించబోవన్నారు.

వ్యాఖ్యలపై విమర్శలు

వ్యాఖ్యలపై విమర్శలు

కాగా, ఆసిఫ్ వ్యాఖ్యలను పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు తప్పుబట్టారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా అందుకు సంబంధించిన మూలాలు పాక్‌లోనే ఉండటాన్ని ప్రస్తావించారు. భారత్‌లోకి లష్కర్‌, జైస్‌ ఎ మహ్మద్‌.. తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన మూకలను పంపిస్తూ భారత్‌లో ఉగ్రదాడులకు కారణమవుతున్న పాక్‌ వైఖరిని తప్పుబట్టారు.

English summary
Foreign Minister Khawaja Muhammad Asif Monday said that peace between India and Pakistan would be possible only through finding a durable solution to the Kashmir dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X