పాకిస్తాన్ ను ఉతికి ఆరేసిన భారత్..!!
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ ప్రసంగించారు. పాకిస్తాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ దేశం పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే ఏకిపారేశారు. తీవ్రవాదానికి పాకిస్తాన్ ఎపిక్ సెంటర్ గా అభివర్ణించారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం ప్రపంచ దేశాల బాధ్యతను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని దేశాలు సమష్టిగా దీన్ని అణచివేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారత్.. తీవ్రవాద ముప్పును ఎదుర్కొంటుందని జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా.. అవి ఒక్క దేశంతో సంబంధం ఉన్నవే.. దానికి సంబంధించినవేనని పాకిస్తాన్ ను ఉద్దేశించి చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘటన- సరిహద్దుల మీదుగా జరిగే అనాగరికతకు నిదర్శనమని జైశంకర్ స్పష్టం చేశారు.

పహల్గామ్ దాడికి కారణమైనవారిని శిక్షించామని జైశంకర్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు. ఈ ఆపరేషన్ ద్వారా దేశ ప్రజల ప్రాణాలను కాపాడుకునే హక్కును భారత్ స్వేచ్ఛగా వినియోగించుకుందని పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద దాడిని ప్లాన్ చేసిన వారిని, అమలు చేసిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టామని అన్నారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మతం, హింస, అసహనం, భయం.. ఇలా అన్నింటినీ కలగలిపిన ఉగ్రవాదాన్ని నిర్మూలించక తప్పదని జైశంకర్ తేల్చి చెప్పారు. ఉగ్రవాదులను అభివృద్ధి నిరోధకులుగా అబివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారత్.. ఈ సవాల్ ను ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. తీవ్రవాదానికి ఎపిక్ సెంటర్ అయిన పొరుగుదేశం భారత్ కు ఉందని వివరించారు. ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సరిహద్దు ఉగ్రవాదం, చొరబాటు, తీవ్రవాద శిబిరాలు.. ఇలా అన్నింటినీ భారత్ పై గురిపెట్టిందని పేర్కొన్నారు.
వివిధ దేశాలకు భారత్ అందిస్తోన్న సహకారాన్ని జైశంకర్ వివరించారు. 78 దేశాల్లో 600 కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు బాధ్యత వహిస్తున్నామని, గ్లోబల్ సౌత్‌లో అగ్రగామిగా నిలిచామని చెప్పారు. ఆర్థికం, ఆహారం, ఎరువులు, ఇంధనం వంటి రంగాల్లో 78 దేశాలకు సహాయ, సహకారాలను అందిస్తోన్నామని తెలిపారు. ఇతర దేశాల అత్యవసర అవసరాలకు ప్రతిస్పందించడానికి ఎప్పుడూ ముందుంటామని అన్నారు. భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు మానవత దృక్పథంతో ఆదుకుంటోన్నామని చెప్పారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications