వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేధింపులు భరించలేక తల్లిదండ్రులను హత్య చేసిన కూతురు

By Narsimha
|
Google Oneindia TeluguNews

పీల్: స్వంత తల్లిదండ్రులను అత్యంత పాశవికంగా హత్య చేసింది ఓ యువతి. వేధింపులను భరించలేకే తల్లిదండ్రులను హాత్యచేసినట్టు ఆ యువతి ప్రకటించింది.ఈ హాత్యల పట్ల తనను రాక్షసురాలిగా చిత్రీకరించడాన్ని ఆ యువతి తప్పుబట్టింది. తనకు ఉన్న భాదలన్నీ సమసిపోయాయని ఆ యువతి సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

తల్లి దండ్రులను అత్యంత దారుణంగా హత్య చేసిన యువతి పేరు ఆస్లే మార్టిస్ సన్. ఈ పేరు పీల్ పరిసర ప్రాంతాల్లో మార్మోగిపోతోంది. తల్లిదండ్రులను హత్య చేయడంతో ఇంతకాలంపాటు తాను అనుభవించిన నరకం నుండి విముక్తి పొందినట్టు ఆమె చెబుతోంది.తన పెంపుడు తండ్రి నేయర్స్ వేధించేవాడని మార్టిన్ సన్ చెబుతోంది.ఈ వేదింపులు భరించలేక ఆమె నేయర్స్ ను తుపాకితో కాల్చి చంపింది.

murder

తన తల్లిని 30 సార్లు కత్తితో పొడిచింది.తల్లి శరీరంపై ఇష్టమొచ్చినట్టు కత్తితో ఆమె పొడవడంతో స్థానికంగా మార్టిన్ సన్ ను రాక్షసురాలిగా పిలుస్తున్నారు.ఈ హాత్యలకు గాను మార్టిన్ సన్ కు 23 ఏళ్ళ పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.ఈ ఇద్దరిని పాశవికంగా హాత్య చేయడానికి వారు పెట్టే వేదింపులే కారణమని మార్టిన్ సన్ చెబుతోంది.

తన తల్లి బాయ్ ప్రెండ్ తాను 9 ఏళ్ళ వయస్సున్న సమయంలో రేప్ చేశాడని చెప్పింది. ఆ సమయంలో ఎవరూ కూడ తన గురించి మాట్లాడలేదని ఆమె ప్రశ్నిస్తోంది. తనను వేధించిన కారణంగానే తన స్వంత తండ్రి కూడ ఇంటిని వదిలి వెళ్ళారని ఆమె చెప్పింది.ఇక పెంపుడు తండ్రి నేయర్స్ నరకాన్ని చూపేవాడని ఆమె ఆరోపించింది.తన తల్లి కూడ ఇదే రకంగా వ్యవహారించేదని ఆమె గుర్తుచేసుకొన్నారు. అందుకే వారిని చంపానని మార్టిన్ సన్ తేల్చి చెప్పింది.జైలు జీవితం తనకు బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

English summary
18 years old martinson young lady murdered her parents.this incident was at peel.martinson harassed by her step father nayors, own mother years ago.when she was 9 years old her mothers boy friend rape her.her step father every day harassed and also mother. her own father go away from the house harassements said martinson.so, matinson murdered her step father, mother .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X