ఎంత కొట్టినా చావని పాములా పాకిస్థాన్..!
జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. ఈ విషయాన్ని భారత రక్షణశాఖ ఆ సమయంలో అధికారికంగా వెల్లడించింది. అయితే పాకిస్థాన్ మాత్రం ఎంత కొట్టినా చావని పాములా వ్యవహరిస్తోంది. ధ్వంసం అయిన ఉగ్ర స్థావరాలను తిరిగి నిర్మించుకుంటోంది. అందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
LeT Reactivates 2 Major Terror Camps In PoK With ISI Support, Top Global Terrorists Visit Muzaffarabad
— ABP LIVE (@abplive) July 24, 2025
✍️ Shivank Mishra#LeT #PoK #Pakistan https://t.co/iFbgd62pf1
ఎంతకొట్టినా చావని పాములా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. ఓ వైపు ఉగ్రవాదాన్ని ఏరివేసే పనిని భారత్ భుజానికి ఎత్తుకుంటే మరోవైపు పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వాటిలో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, సియాల్ కోట్ లోని మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్.. ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది.
అయితే ఈ 9 ఉగ్రవాద స్థావరాలను పాకిస్థాన్ ఇప్పట్లో నిర్మించడం కష్టమే.. కానీ 2019 బాలా కోట్ దాడి తర్వాత మూసేసిన లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్లా బిన్ మసూద్, చెలా బండి అనే రెండు ఉగ్ర శిబిరాలను మళ్లీ పునరుద్ధరించింది. ఈ రెండింట్లో ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు తిరిగి ప్రారంభించింది. అంతేకాక లష్కరే తోయిబా సంస్థ.. తమ ఉగ్రవాదుల బస కోసం నాలుగు చిన్న తాత్కాలిక టిన్ లను కూడా నిర్మించింది. ఓ కొత్త వాచ్ టవర్ ను కూడా నిర్మించింది. వీటిని శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించారు. ముజ్ ఫరాబాద్ సిరికోట్ లో జూన్ నుంచే పాత లాంచింగ్ ప్యాడ్ అయిన అబ్దుల్లా బిన్ మసూద్ ను పునరుద్ధరిస్తోందని నిఘా సంస్థలకు సమాచారం అందింది.

అయితే పాక్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడిలో పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలతో పాటు రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ కూడా ధ్వంసం అయింది. ఈ విషయాన్ని మొదట పాకిస్థాన్ తిప్పికొట్టినప్పటికీ తర్వాత ధ్వంసం అయినట్టు ఒప్పుకుంది. అయితే ఈ ఘటన జరిగి దాదాపు 3 నెలలు కావస్తున్నా ఈ ఎయిర్ బేస్ మాత్రం రిపేర్ కాకపోవడం గమనార్హం. తాజాగా రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ ప్రారంభ తేదీని మరోసారి వాయిదా వేసింది పాకిస్థాన్. ఆగస్టు 5 న ఓపెన్ చేస్తామని పేర్కొంది. ఈ ఎయిర్ బేస్ జులై 4 తేదీనే అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ మరమ్మతుల కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు.












Click it and Unblock the Notifications