థ్రిల్ కోసం మనిషిని హత్య చేసిన భార్యాభర్తలు

man murdered by coupl for thrill
ఫిలడెల్ఫియా: అమెరికాకు చెందిన భార్యాభర్తలు థ్రిల్ కోసం ఓ వ్యక్తిని హత్య చేసి కటకటాల పాలయ్యారు. మూడు వారాల క్రితం పెళ్లి చేసుకున్న వారికి ఓ చిలిపి కోరిక పుట్టింది. అది అత్యంత కిరాతకమైన కోరిక కూడా. దాంతో ఆన్‌లైన్ ప్రకటన ఇచ్చి ఓ మనిషిని వలలో వేసుకుని అతన్ని హత్య చేశారు. ఫిలడెల్ఫియాకు చెందిన ఎలిటీ బాబర్ (22), మిరిండా బాబర్ (18) అనే ఆ భార్యాభర్తలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. వారిని పోలీసులు అరెస్టు చేసి, వారిపై హత్యానేరం మోపారు.

ఫిలడెల్ఫియాకు ఈశాన్యంగా వంద మైళ్ల దూరంలో ఉన్న సన్‌బరీ పట్టణంలో నవంబర్ 12వ తేదీన ట్రాయ్‌లా ఫెరారీ (42) అనే వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆ హత్యను ఛేదించే క్రమంలో పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని సన్‌బర్ పట్టణంలో అతన్ని బాబార్ దంపతులు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

బాబార్ దంపతులు చాలా కాలంగా ఓ వ్యక్తిని హత్య చేస్తే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకున్నారు. దాన్ని ఆచరణలో పెట్టడానికి మిరిండా బాబర్ తోడు కావాలంటూ ఆన్‌లైన్‌లో వరుసగా ప్రకటనలు ఇస్తూ వెళ్లింది. దానికి ఆకర్షితుడైన ట్రాయ్‌లా ఫెరీరాను నవంబర్ 12వ తేదీన ఓ షాపింగ్ మాల్ వద్ద తమ కారులో ఎక్కించుకున్నారు. ముందు సీట్లో మిరిండా, పక్కన ఫెరీరా కూర్చోగా, వెనక సీట్లో ఎలిటా బాబర్ కూర్చున్నాడు.

తన భార్య సైగ చేసిందే తడవుగా ఎలిటీ వెనక నుంచి ఫెరార మెడకు వైర్ బిగించాడు. ఆ తర్వాత మిరిండా కత్తితో ఫెరీరాను పొడిచింది. దాంతో అతను చనిపోయాడు. ఆ తర్వాత శవాన్ని కారులోంచి తోసెసి వెళ్లిపోయి క్లబ్‌లో ఎలిటీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. తొలుత తమకేమీ తెలియదని బుకాయించిన మిరిండా తాను 20 కత్తిపోట్లు పొడిచినట్లు అంగీకరించింది. థ్రిల్ కోసమే ఈ హత్య చేశామని ఎలిటీ చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+