అమెరికా చట్ట సభలో మోడీ అనుకూల సభ్యుడి రాజీనామా
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలురైన అమెరికా చట్టసభ సభ్యుడు ఆరోన్ షోక్ రాజీనామా చేశారు. రవాణా ఖర్చుల విషయంలో తప్పుడు లెక్కలు చూపడంతోపాటు భారత పర్యటనలో భాగంగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక ఫొటో గ్రాఫర్‌ను వెంటతీసుకెళ్లారన్న ఆరోపణలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
రిపబ్లికన్ పార్టీ తరపున ఇల్లినాయిస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆరోన్ షోక్.. ఈ మేరకు తన నిర్ణయాన్ని మంగళవారం ప్రకటించారు. మోడీపై ఉన్న అమెరికా వీసా నిషేధం అంశంపై చర్చించడానికి 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో సమావేశమైన అమెరికా ప్రతినిధుల బృందంలో షోక్ కూడా ఉన్నారు.
భారత్‌లో అంటరానితనాన్ని ఖండిస్తూ అమెరికా తీర్మానం

భారత్ తోపాటు దక్షిణాసియా దేశాల్లోని దళితులపై ఉన్న అంటరానితనాన్ని ఖండిస్తూ.. అమెరికా చట్టసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దళితులపై చూపుతున్న వివక్షను తమ సరిహద్దుల్లోనే అరికట్టాలని, దళితుల హక్కులను గౌరవించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ తీర్మానాన్ని చట్టసభ సభ్యుడు ఎలెనోర్ నార్టన్ గురువారం ప్రవేశపెట్టారు.
భారత్, నేపాల్ తోపాటు దక్షిణాసియా దేశాలు, అక్కడి నుంచి ప్రజలు వలసవెళ్లిన దేశాలైన నైజీరియా, సెనెగల్, మారిటారియా, యెమెన్, జపాన్‌లలో ఈ వివక్ష ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 26 కోట్ల మంది దళితులు ఇంకా అంటరానితనం అనే వివక్షకు గురవుతున్నారని తీర్మానంలో తెలిపారు.












Click it and Unblock the Notifications